
నితిన్ కి హిట్స్ కంటే డిజాస్టర్లు ఎక్కువ
నితిన్ కెరీర్ లో హిట్లు కంటే డిజాస్టర్లే ఎక్కువ. అంటే ఫ్లాపులు, యావరేజ్ ల కంటే కూడా డిజాస్టర్లు ఎక్కువ. 2020లో వచ్చిన భీష్మ మూవీ అతని లాస్ట్ హిట్ మూవీ. దిల్ సే గురించి ఎంత పొగిడిన ఈ చిత్రానికి నిర్మాత అయిన నాగవంశీకి కమర్షియల్ గా ఇది పెద్ద లాస్ మూవీ అనేది అందరికీ తెలిసిందే. తర్వాత వరుసగా చెక్, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, రాబిన్ హుడ్, తమ్ముడు ఇలా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్స్ గా తేలిపోయాయి. దీంతో తనకు ఎలాంటి కథలు సెట్ అవుతాయో అని తెగ ఇబ్బంది పడిపోతున్నాడు.ఈ టైమ్ లో దండోరా వంటి మూవీ తీసిన మురళీకాంత్ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. అదే అలియాస్ రుక్మిణీ. ఇది చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇంకా చెబితే డిసెంబర్ 4న విడుదల కాబోతోంది.
రుక్మిణీ కళ్యాణంపై పాజిటివ్ బజ్ ఉందా..?
అలియాస్ రుక్మిణీ టైటిల్ తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు అన్నీ బావున్నాయి. అయినా నితిన్ మూవీ కాబట్టి ఎక్కడో కొడుతోంది అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. అందుకు కారణం ముందే చెప్పినట్టుగా నాన్ స్టాప్ గా వచ్చిన డిజాస్టర్లే. బట్ ఈ మూవీలో అతని మేకోవర్ మారింది. కంటెంట్ పై కాస్త ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా ఉంది. బలమైన కథ సెట్ అయితే హిట్ అవడం పక్కా అని కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ నితిన్ వల్లే ఈ డౌట్.
నాని బ్యానర్ లో నితిన్ సినిమా
ఆఫీయా అనే కొత్తమ్మాయి ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. దీప్తి గంట నిర్మిస్తోన్న మూవీ ఇది. అంటే నాని సొంత బ్యానర్ అన్నమాట. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు బావున్నాయి. పాటలు చాలా బావున్నా.. మూవీపై అంచనాలు మాత్రం పెరగడం లేదు. అదీ కాక అదే రోజు ఆల్రెడీ హైప్ ఉన్న నాగ చైతన్య మూవీ వృషకర్మ కూడా విడుదల కాబోతోంది. ఏదేమైనా ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సి స్థితిలో ఉన్నాడు. ఒకవేళ అలియాస్ రుక్మిణీ కూడా పోయిందంటే అతని కెరీరే ప్రశ్నార్థకంలో పడుతుంది.
