
ధనుష్ కొత్త సినిమాలేంటీ..?
ధనుష్ చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. తన స్టార్డమ్ కోసం కాకుండా కథల్లో దమ్ముంటే ఎలాంటి పాత్రైనా ఓకే చేస్తున్నాడు. ఈ యేడాది కారా అనే మూవీతో వచ్చాడు. బట్ ఇదేమంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓమ్ తో రాబోతున్నాడు. ఇది ఈ నెల 19న విడుదల కాబోతోంది తర్వాత మరో రెండు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. ఇందులో తమిళ్ మురుగన్ అనే టైటిల్ తో ఓ మూవీ అనౌన్స్ అయింది. ఇది అతని పొలిటికల్ ఎంట్రీకి సిద్ధం చేయబోతున్న మూవీ అని ప్రస్తుతం గాసిప్స్ వినిపిస్తున్నాయి.
మణిరత్నం ఇంకా ఫామ్ లో ఉన్నాడా..?
మణిరత్నం అంటే ఏ హీరోకైనా ఓ రెస్పెక్ట్ ఉంటుంది. అతనితో పనిచేయాలని ప్రతి హీరోల కలలు కంటాడు. కాకపోతే మణిరత్నం కొన్నాళ్లుగా ఫామ్ లో లేడు. పొన్నియన్ సెల్వన్ అంటే కేవలం తమిళులకు మాత్రమే కనెక్ట్ అయింది. అయినా ఈ సారి ఓ బలమైన కథ సిద్దం చేసుకున్నాడు. ఇందులో ఇద్దరు హీరోలు ఉండబోతున్నారు. ఓ హీరోగా ధనుష్ ని ఆల్రెడీ తీసుకున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. మరో హీరోగా తెలుగు స్టార్ నాని చేయబోతున్నాడు అని.. నాని కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే గాసిప్ వినిపిస్తోంది.
నాని మాస్ మోజు తీరిందా..?
నాని ప్రస్తుతం మాస్ మోజులో పడిపోయి ద ప్యారడైజ్ మత్తు దిగిపోయింది. అతని కటౌట్ మాస్ హీరో అనే మాటకు చాలా దూరం ఉంది. అందుకే అతను కూడా తన తర్వాతి మూవీ బ్లడీ రోమియో కథలో మార్పులు చేయమని దర్శకుడు సుజిత్ చెప్పాడు అంటున్నారు. మామూలుగా మణిరత్నం అంటే నానికి బాగా ఇష్టమైన దర్శకుడు. మరి అలాంటి దర్శకుడే తన సినిమాలో చేయమని అడిగితో నో చెబుతాడా..? ఛాన్సే లేదు.
అఫీషియల్ న్యూస్ కోసం వెయిటింగ్
బట్ ఈ వార్త ఇంకా అఫీషియల్ గా రాలేదు. అటు ధనుష్ అయినా ఇటు నాని అయినా మణిరత్నం సినిమా చేయబోతున్నాం అని ఓపెన్ గా చెప్పలేదు. ఒక్కసారి అఫీషియల్ న్యూస్ వస్తే ఈ కాంబినేషన్ పై ఎక్స్ పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు.
