Gaaradi Telugu news logo

వెంకటేష్ మూవీపై బజ్ లేదా..?

వెంకటేష్ హీరోగా నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. ఈ 30న విడుదల కాబోతోందీ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషనల్ గా అంత ప్రభావం చూపించలేదు. ట్రైలర్ బావుంది అనే టాక్ ఉన్నా.. సినిమాపై ఆశించినంత బజ్ మాత్రం క్రియేట్ కాలేదు అనేది వాస్తవం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నారా రోహిత్ మరో కీలక పాత్రలో నటించిన మూవీ ఇది. ఆశ్చర్యం ఏంటంటే.. ట్రైలర్ లాంచ్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ నారా రోహిత్ ను మినిమం కూడా పట్టించుకోలేదు. మరేమైనా ఇది స్ట్రాటజీనా లేక తన పాత్రపై అతనికి ఉన్న అసంతృప్తి కారణమా అనేది తేలాల్సి ఉంది.

విశ్వక్ సేన్ కల్ట్ పై తుఫాన్ ఎఫెక్ట్

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా కల్ట్. కొన్నాళ్లుగా విశ్వక్ సేన్ కు అన్నీ ఫ్లాపులే వస్తున్నాయి. అందుకే మళ్లీ తనే దర్శకత్వం చేశాడేమో అనుకోవచ్చు. కల్ట్ ట్రైలర్ లో చాలా సినిమాలు కనిపిస్తున్నాయి. అయినా ట్రైలర్ బానే ఉందనే చెప్పాలి. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ రైటర్. అందుకే కాస్త అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనే కంటే అసలీ మూవీపై అర్ణబ్ తుఫాన్ ప్రభావం బలంగా ఉండబోతోందా అనేది తేలాల్సి ఉంది.

ఆదర్శ కుటుంబం.. అసలే తుఫాన్.. ఆపై టికెట్ ధరల పెంపు

ఆదర్శ కుటుంబంకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు కూడా పెంచారు. ఇటు చూస్తే అర్ణబ్ తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అది కాస్త తగ్గింది కానీ దానివల్ల జరిగిన నష్టం నుంచి తేరుకోవడానికి జనానికి చాలా రోజులు పడుతుంది. మరి ఇన్ని రోజుల పాటు ఆదర్శ కుటుంబం నిలుస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. పోనీ ఈ బాధ నుంచి బయటకు రావడానికి సినిమాకైనా వస్తే టికెట్ రేట్లు పెంచి ఉన్నారు. ఇది కూడా ఓ మైనస్ గా కనిపిస్తోంది.

ఆదర్శ కుటుంబం, కల్ట్, కిల్లర్ పై తుఫాన్ ప్రభావమెంత..?

ఏదేమైనా ఆదర్శ కుటుంబం, కల్ట్ తో పాటు ఇదే రోజున విడుదల కాబోతోన్న కిల్లర్ పై తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా పడుతుందనేది వాస్తవం. తుఫాన్ నుంచి జనం కోలుకోవడానికే చాలా టైమ్ పడుతుంది. మరి ఈ టైమ్ లో ఏపి ఆడియన్స్ ఈ చిత్రాలను చూస్తారా అనేది పెద్ద ఫజిల్. మరి ఆ ఫజిల్ ను దాటుకుని కూడా జనం చూస్తే.. చూసే అవకాశాలు తక్కువే.. కానీ చూస్తే అదో గొప్ప విషయమే అని చెప్పాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి