Gaaradi Telugu news logo

వెంకటేష్, త్రివిక్రమ్ లకు ఇది నిజంగా వర్కవుట్ అవుతుందా..?

ఆదర్శ కుటుంబం ఆకట్టుకుంటుందా..?

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ రావాలని చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం వెంకీ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు డైలాగ్ రైటర్ త్రివిక్రమ్. ఆ రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ మూవీ చేయాలని కోరుకున్నారు. కాస్త ఎక్కువ టైమే పట్టినా.. ఫైనల్ గా వారి కోరిక ఆదర్శ కుటుంబంతో నెరవేరుతోంది. ఈ నెల 30న ఆదర్శ కుటుంబం విడుదల కాబోతోంది.

వెంకటేష్ కు పర్ఫెక్ట్ టైటిల్

వెంకటేష్ హీరో కాబట్టి ఆదర్శ కుటుంబం అనే టైటిల్ పర్ఫెక్ట్ సూట్ అవుతుందని చాలామంది భావించారు. బట్ తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే భిన్నమైన కంటెంట్ కనిపిస్తోంది. త్రివిక్రమ్ తను ఫస్ట్ టైమ్ కొత్త జానర్ తో వస్తున్నానని చెప్పాడు. ట్రైలర్ చూస్తే డార్క్ కామెడీ ఉంది, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.. త్రివిక్రమ్ స్టైల్లో పంచ్ లు కూడా ఉన్నాయి. ట్రైలర్ అయితే బానే ఉంది. బట్ ఈ జానర్ వెంకటేష్, త్రివిక్రమ్ కు వర్కవుట్ అవుతుందా లేదా అనేది పెద్ద సమస్య.

దండుపాళ్యం, బ్లాస్ట్ లను పోలిన ట్రైలర్

ట్రైలర్ రెండు పెద్ద సమస్యలున్నాయి. ఒకటి ఒకటి ట్రైలర్ లోనే దండుపాళ్యం గ్యాంగ్ లాంటిది ఒకటి కనిపిస్తోంది. ఆ బ్యాచ్ అచ్చంగా దండుపాళ్యం టీమ్ లాగానే ఉంది. మరి త్రివిక్రమ్ ఇందులో దాన్ని ఓ రిఫరెన్స్ లాగా తీసుకున్నాడా లేక కాపీ కొట్టాడా అనేది ఒక పాయింట్. మరో పాయింట్ ఫ్యామిలీ మొత్తం ఫైట్ చేస్తుంది. ఇది రీసెంట్ గా వచ్చిన బ్లాస్ట్ మూవీలాగా ఉంది. ఇంకా చెబితే బ్లాస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. అంటే అక్టోబర్ 2న కాదు.. నిజానికి ఇది సమ్మర్ లోనే విడుదల కావాల్సి ఉంది. బట్ బ్లాస్ట్ చూసి మా సినిమా కూడా అలాగే ఉంది అని ఫీలయ్యే కథలో చాలా మార్పులు చేశాడు.అందుకే రిలీజ్ కు ఇంత టైమ్ పట్టింది.

వెంకీ, త్రివిక్రమ్ ఆ పాయింట్ ను దాటుతారా..?

సో.. ఆదర్శ కుటుంబంకు ఈ రెండు పాయింట్స్ పెద్ద సమస్యగా కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ జానర్ మార్చాడు కానీ కాపీ కొట్టడంలో ఎక్స్ పర్ట్ అనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రెండు పాయింట్స్ ను కూడా ఇలాగే చేశాడా అనేది పెద్ద పాయింట్. ఒకవేళ ఆ పాయింట్స్ లైట్ కనిపించినా తనదైన శైలిలో బాగా ఎంటర్టైన్ చేస్తే సినిమా పాస్ అయిపోతుంది. లేదంటే ఇవాళా రేపు ఆడియన్స్ బాగా తెలివి మీరిపోయారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇట్టే పట్టేస్తారు.. సినిమాను లైట్ తీసుకుంటారు. మరి వెంకటేష్, త్రివిక్రమ్ ల ఈ కొత్త జానర్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి