Gaaradi Telugu news logo

రజినీకాంత్ కు రీ ప్లేస్ లేదు

సూపర్ స్టార్ రజినీకాంత్ కు రీ ప్లేస్ లేదు. అలాంటి అతనితో విజయ్ దేవరకొండకు కంపేరిజన్ ఏంటీ అనిపించడం కామన్. బట్ ఇక్కడ ఇద్దరి గురించి కాదు. రజినీకాంత్, విజయ్ దేవరకొండ నటించిన సినిమాల విషయంలో మాత్రమే మాట్లాడుతున్నాం. రజినీకాంత్ నటించిన జైలర్ 2 ఈ నెల 15న విడుదల కాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై తమిళనాడులో భారీ అంచనాలున్నాయి. ఓ రకంగా ఇది వెయ్యి కోట్ల క్లబ్ లో చేరబోతోన్న ఫస్ట్ తమిళ్ మూవీ అని వాళ్ల మీడియంలో తెగ హడావిడీ చేస్తున్నారు. జైలర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తర్వాత రజినీకాంత్ కు ఆ స్థాయి విజయం రాలేదు. అందుకే జైలర్ 2పై ఈ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

విజయ్ దేవరకొండకు రణబాలి ఓ ఛాలెంజింగ్

విజయ్ దేవరకొండకు రణబాలి ఓ ఛాలెంజింగ్ మూవీగానే కనిపిస్తోంది. గీత గోవిందం తర్వాత అతనికి ఆ స్తాయి సక్సెస్ రాలేదు అనేది వాస్తవం. మధ్యలో ఓ రెండు మూడు సినిమాలు ఆకట్టుకున్నాయి కానీ ఆ రేంజ్ హిట్ గా నిలవలేకపోయాయి. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్ర్యానికి పూర్వ జరిగే కథగా ఇది ఉండబోతోంది. 1876-1878 కాలంలో సాగే కథ. విజయ్ భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది కాబట్టి అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. రణబాలి ఈ నెల 16న విడుదల కాబోతోంది.

జైలర్ 2 వర్సెస్ రణబాలి

రజినీకాంత్ నటించిన జైలర్ 2 అక్టబోర్ 15న వస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన రణబాలి 16న వస్తోంది. అందుకే ఈ ఇద్దరి సినిమాలపై తెలియకుండా ఓ కంపేరిజన్ కనిపిస్తోంది. ఇద్దరిలో ఎవరి మూవీ బెస్ట్ కాబోతోంది. ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధించబోతోంది.. అనే పోలికలు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి.

విజయ్ దేవరకొండపై పెయిడ్ నెగెటివిటీ

విజయ్ దేవరకొండ మూవీపై ట్రైలర్ రావడానికి ముందే నెగెటివిటీ వ్యాప్తి చేస్తున్నారు చాలామంది. వీళ్లంతా పెయిడ్ బ్యాచ్ అని వేరే చెప్పక్కర్లేదు. సినిమా బావున్నా బాలేదు అని చెప్పడానికి వీళ్లంతా సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు జైలర్ 2 వస్తోంది కాబట్టి రణబాలి నిలవలేదు అనే ప్రచారం కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ గొడవలన్నీ దాటి విజయ్ దేవరకొండ ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొడితే ఖచ్చితంగా అతని రేంజ్ కూడా మారుతుంది. అందుకే ఈ సారి ఎలాగైనా రజినీకాంత్ లాంటి మూవీ ముందు అతను నిలబడితే అదో బోనస్ గా మారుతుంది. కాకపోతే ముందు ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ గా నిలుస్తారు అనేది చూడాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి