Gaaradi Telugu news logo

చిరంజీవి రియాలిటీ షో

చిరంజీవితో తేజ సజ్జా పోలికా అనిపిస్తుంది కదా. యస్.. అయితే ఇది సినిమాల విషయంలో కాదు. రియాలిటీ షోస్ వల్ల. అయినా తేజ రేంజ్ కు మెగాస్టార్ రేంజ్ చాలా అంటే చాలా తేడా ఉంటుంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మెల్లగా మొదలుపెట్టిన వాళ్లే ముందుకు దూసుకుపోతుంటారు. సరే అదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారు కదా. యస్.. మెగాస్టార్ చిరంజీవి ఓ రియాలిటీ షో చేయబోతున్నాడు. ఆల్రెడీ నందమూరా బాలకృష్ణ అన్ స్టాపబుల్ తో అదరగొట్టాడు కదా. అలా మెగాస్టార్ కూడా ఓ రియాలిటీ షోను హోస్ట్ చేయబోతున్నాడు. దీనికి నెట్ ఫ్లిక్స్ వేదిక కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ అంటే మామూలు కాదు కదా. ఓ రేంజ్ లో ఉండబోతోంది.

మీలో ఎవరు కోటీశ్వరుడుతో పాపులర్ అయిన చిరు

చిరంజీవి తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ షో మంచి హిట్ అయింది. అందుకే మరోసారి ఓ రియాలిటీ షో ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గరగా వెళ్లబోతున్నాడు. అలాగే తన సీనియార్టీ కూడా ఈ షో ద్వారా మరింత యూజ్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి రెమ్యూనరేషన్ పరంగా చూస్తే 50-60 కోట్ల వరకు ఉంది. అయితే ఈ షో ద్వారా అంతకు మించి వస్తుందని టాక్. చిరంజీవి ఈ షో కు ఒప్పుకోవడానికి అదీ ఓ కారణం అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ రాబోతోంది.

అమెజాన్ ప్రైమ్ లో హోస్టింగ్ కు తేజా సజ్జా

తేజా సజ్జా విషయానికి వస్తే చిరంజీవి హీరోగా నటించిన చూడాలని ఉంది మూవీతోనే అతను బాల నటుడుగా పరిచయం అయ్యాడు. తర్వాత చాలా సినిమాల్లో బాల నటుడుగా బాగా అదరగొట్టాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో అనిపించుకుంటున్నాడు. అలాంటి తేజ సజ్జా కూడా ఓ షోకి హోస్టింగ్ చేయబోతున్నాడు. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఆల్రెడీ అమెజాన్ లో రానా కూడా ఇలాగే హోస్టింగ్ చేశాడు. నాని, తేజా, రిషబ్ శెట్టి వంటి వారిని గెస్ట్ లుగా పిలిచి మాట్లాడాడు. బట్ ఎందుకో కానీ ఆ షో అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు అలాంటి షోకే హోస్ట్ గా తేజా సజ్జాను తీసుకుంది అమెజాన్.

చిరంజీవి, తేజా సజ్జా.. ఎవరు బెస్ట్ అనిపించుకుంటారు..

మరి ఈ షోస్ ద్వారా చిరంజీవి, తేజా సజ్జా ఏ మేరకు ఆకట్టుకుంటారో అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ షోస్ లో ఏజ్ తో పనిలేదు.. టైమింగ్ అలాగే ఆ షోకి వచ్చిన గెస్ట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే దానిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సో.. మరి ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనిపించుకుంటారో అనేది చూడాల్సిందే.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి