Gaaradi Telugu news logo

నానిపై భారీ నెగెటివిటీ

నాని హీరోగా నటించిన ద ప్యారడైజ్ మూవీకి యూనానిమస్ గా నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమా అస్సలు బాలేదు అని 90శాతం జనాలు తేల్చారు. మెయిన్ పాయింట్ ను పక్కకు పెట్టి కేవలం మాస్ ను మెప్పించాలని తాపత్రయమే తప్ప అణచివేతకు గురైన జనాల బాధ గురించి అస్సలు పట్టించుకోలేదు అనేది ఎక్కువమంది చెబుతున్న మాట. అదీ కాక నాని స్టేచర్ కి మాస్ హీరో అయ్యేంత సీన్ లేదు అని కూడా తేల్చారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు అస్సలు చరిత్ర తెలియదు అని విమర్శిస్తున్నవాళ్లు చాలామందే. ఇన్ని మైనస్ లు ఉన్నా.. ఈ మూవీ వసూళ్లు మాత్రం ఆగడం లేదు. అందుకు కారణం నాని.

ద ప్యారడైజ్ రెండో రోజు కలెక్షన్స్

నాని సినిమా కాబట్టి ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఆడియన్స్ ఈ మూవీని చూడటం ఆపడం లేదు. ముఖ్యంగా నైజాంలో కాస్త స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తోంది మూవీ. మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి 88 కోట్లు వచ్చాయని నిర్మాతలు ప్రటించారు. రెండో రోజు 114 కోట్లు అయింది అని పోస్టర్ వదిలారు. అంటే రెండో రోజు కూడా 26 కోట్లు వసూళ్లు వచ్చాయని అర్థం. మరి 26 కోట్లు అంటే పెద్ద విషయమే. సినిమా డిజాస్టర్ గా డిక్లేర్ అయిన తర్వాత కూడా ఈ మొత్తం రావడం అంటే అది కేవలం నాని ఇమేజ్ వల్లే. నానికి మాస్ లో పట్టు లేదు. కానీ క్లాస్ ఆడియన్స్ లో బలమైన పట్టు ఉంది.

నాని నెంబర్ వన్ ప్లేస్ లో

నాని టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో దసరా, హాయ్ తర్వాత ద ప్యారడైజ్ దే ఆ స్థానం. అఫ్ కోర్స్ నెంబర్ వన్ ప్లేస్ లో ప్యారడైజ్ ఉంది. ఏదేమైనా ఇక ముందు నాని కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఇలా మాస్ మోజులో పడిపోతే ఉన్న ఇమేజ్ కూడా ఊడిపోతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత కూడా కలెక్షన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటే అది కేవలం నానిపై ఉన్న పాజిటివిటీ వల్లే. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇకపై మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడటం ఆపేయడం మంచిది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి