వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఆదర్శ కుటుంబం. ఈ కాంబోలో మూవీ రావాలని చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్. ఈ చిత్రాల విజయాల్లో మేజర్ షేర్ డైలాగ్స్ దే. అందుకే ఈ కాంబోలో మూవీ రావాలని కోరుకున్నారు. ఫైనల్ గా అదే జరిగింది. ఇప్పుడున్న వెంకటేష్ ఫామ్ లో ఈ కాంబోలో మూవీ అంటే మాగ్జిమం బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.
వెంకటేష్ మూవీ సమ్మర్ లోనే విడుదల కావాల్సి ఉంది. స్టోరీలో మార్పులు అంటే రకరకాల వార్తలు రావడంతో ఈ అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అఫీషియల్ న్యూస్ కూడా చెప్పారు. మరి ఏమైందో తెలియదు కానీ అక్టోబర్ 2నుంచి ఈ మూవీ వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఇప్పటి వరకు జస్ట్ టీజర్ మాత్రమే విడుదల చేసింది టీమ్. అంతే తప్ప మిగతా వార్తలేవీ రావడం లేదు. కనీసం ఓ పాట కూడా విడుదల చేయలేదు.
ఆదర్శ కుటుంబం విడుదలకు రెండు వారాల టైమ్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు వాయిదా అనే మాట వినిపిస్తోంది అంటే అది నిజమే అనిపిస్తోంది. బట్ ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ మాత్రం రాలేదు. ఇక ఈ మూవీలో నారా రోహిత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రోహిత్ కు జోడీగా నివేదా పేతురాజ్ అంటున్నారు. ఏదేమైనా ఆదర్శ కుటుంబం వాయిదా పడుతోందనే వార్తలకు ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ లేదు. బట్ ఒక వారం ఆలస్యంగా అక్టోబర్ 9న వస్తుందనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.
