నానికి ప్యారడైజ్ పై నమ్మకముందా..?
నాని హీరోగా నటించిన మూవీ ద ప్యారడైజ్. ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓటిటి డీల్స్ కూడా భారీ ధరకే అమ్మేశారు. కాకపోతే అంచనాల విషయంలో మిక్స్ డ్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. అందుకు కారణం కేవలం టీజర్ తో మాత్రమే మూవీని విడుదల చేస్తున్నారు. ట్రైలర్ కూడా ఉంటే బావుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. టీజర్ కూడా చాలా మైనస్ గా కనిపించింది. అందులో డైలాగ్స్ అస్సలు వినిపించలేదు. ఏదేమైనా ఈ మూవీపై అంచనాలు మాత్రం పెద్దగా లేవు అనేది వాస్తవం.
నాని మూవీకి ‘ఏ’సర్టిఫికెట్..?
నాని మూవీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతాయి. బట్ ఈ మూవీకి ‘ఏ’సర్టిఫికెట్ వచ్చింది. ఇది ఓ రకంగా మైనస్ అనే చెప్పాలి. అలాగే టీజర్ చూసిన తర్వాత చాలామందికి కలిగిన అభిప్రాయం ఏంటంటే.. ఇలాంటి మూవీస్ కు నాని అస్సలు సూట్ కాడు అని. మరీ ఊరమాస్ క్యారెక్టర్స్ అంటే దసరా టైమ్ లోనే చాలా కామెంట్స్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు దాన్నే రిపీట్ చేయడం ఏమంత బాలేదు అంటున్నారు కొందరు.
ద ప్యారడైజ్ పై అంచనాలు తగ్గిపోవడానికి కారణం.. ఏషనాగుల కట్టమీద పాట కూడా. ఈ పాట కీర్తి సురేష్ పై చేశారు. తను చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ అది. అయినా ఈ మూవీలో మేటర్ లేదు కాబట్టే ఈ పాటను బలవంతంగా పెట్టారు అనే భావన కూడా కొందరిలో ఉంది. అదీ కాక ఈ పాటను కంప్లీట్ గా ఇండోర్ చేయడం వెనక కూడా కారణం అదే ఫీలింగ్ కూడా ఉంది.
శ్రీకాంత్ ఓదెలపై అంత నమ్మకమేంటీ
ఇక శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం లేదు అని చాలామంది అనుకుంటున్నారు. దసరా మూవీ విషయంలోనే తెలంగాణలోని చాలామందే ఇదేం మూవీ అనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా ఓటిటిలో చూసిన తర్వాత దసరాపై చాలా కామెంట్స్ వచ్చాయి. ఇంత బోరింగ్ మూవీ ఏంట్రా బాబూ అని ఫీలయ్యారు. అలాంటిది ఆ దర్శకుడిని మళ్లీ నాని నమ్మడం మాత్రం కొంత ఆశ్చర్యంగా ఉంది. అలాగే ద ప్యారడైజ్ మూవీలో నాని పాత్రకి జడలు ఉండటం కూడా ఇప్పటికే చాలామంది అదేం గెటప్ రా బాబూ అని ఫీలవుతున్నారు.
నాని మాస్ ఇమేజ్ కోసం తాపత్రయం
నాని లాంటి ఫ్యామిలీ స్టార్ మాస్ హీరో అనిపించుకోవాలని బాగా తాపత్రయ పడుతున్నాడు. కానీ అతని కటౌట్ కు ఆ ఇమేజ్ రావడం కష్టమే అని ఇంకొందరి ఫీలింగ్. ఏదేమైనా ఈ మూవీపై రోజురోజుకూ అంచనాలు తగ్గిపోతుండటం మాత్రం ఆశ్చర్యమే. అదీ కాక నాని ఇది ప్యాన్ ఇండియా మూవీ అని తెగ చెప్పుకుంటూనే ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఆ ప్రమోషన్స్ కు వచ్చిన జర్నలిస్ట్ ల పేరుతో వచ్చిన వాళ్లెవరూ అక్కడ నిజమైన జర్నలిస్ట్ లుగా మాత్రం కనిపించడం లేదు. చిన్నవాళ్లు, కొందరు పెయిడ్ ఆర్టిస్ట్ లను కూడా ప్రమోషన్స్ లో తీసుకుంటున్నారు అని చూసిన వాళ్లంతా భావిస్తున్నారు.
నాని, శ్రీకాంత్ ఓదెల అనుకున్నది సాధిస్తారా
నాని ప్రయత్నం బావుంది. శ్రీకాంత్ ఓదెల నమ్మకం నిజమవుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సిందే. ఇప్పటికైతే ఎక్స్ పెక్టేషన్స్ లేవు. సినిమా రిలీజ్ అయితే కానీ అసలు విషయం బయటకు రాదు. మొత్తంగా నాని, శ్రీకాంత్ ఓదెల అనుకున్నది సాధిస్తారా లేదా అనేది ఈ నెల 24న తేలిపోతుంది.
