
అనిల్ రావిపూడి బోర్ కొట్టిస్తున్నాడా..?
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ పై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయా..? అంటే అవుననే చెబుతున్నారు చాలామంది. అందుకు కారణం.. అనిల్ రావిపూడి లేటెస్ట్ మూవీ ‘జనవరి 12 విడుదల’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్. యస్.. ఈ పాట చూసిన ప్రతి ఒక్కరూ అనిల్ రావిపూడి టేస్ట్ ఏంటీ ఇంత వరస్ట్ గా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. అయినా అనిల్ రావిపూడి గత రెండు చిత్రాల్లో పూర్తిగా క్రింజ్ కామెడీతో నెట్టుకొచ్చాడు. మన శంకరవర ప్రసాద్ గారు అయితే మరీ దారుణంగా ఉంది.. ఈ మూవీకి అంత కలెక్షన్స్ ఎలా వచ్చాయి అంటున్నారు.
డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ నుంచి ఊహించని కాంబో
ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత ఎవరూ ఊహించని విధంగా అనిల్ రావిపూడితో మూవీ అనౌన్స్ చేశాడు. ఆ అనౌన్స్ మెంట్ వచ్చిన వారంలోనే ఈ పాట వచ్చింది. పాట చూసిన అటు వెంకటేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఛీ ఇదేం ఖర్మరా బాబూ అని కామెంట్ చేస్తున్నారు అంటే ఆ పాట ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ను ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు.
అనిల్ రావిపూడికి ఫస్ట్ డిజాస్టర్..?
అనిల్ రావిపూడి సినిమాతో కూడా ఇలాంటే భావన కలిగిస్తే ఖచ్చితంగా ఈ సారి దెబ్బతినడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే అతని రేంజ్ కామెడీపై చాలా వర్గాల ఆడియన్స్ లో రొటీన్ అనే భావన కలిగింది. ఆ భావనను అలాగే కంటిన్యూ చేస్తే జనవరి 12 విడుదలతో సంక్రాంతి రిలీజ్ అయినా డిజాస్టర్ తప్పదు. అదీ కాక వెంకటేష్ కూడా మరీ రొటీన్ గా మారిపోయాడు. అతని టైమింగ్ లో ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదు. అది కూడా సరి చేసుకోవాలి. లేదంటే మొత్తానికే దెబ్బడిపోతుంది.
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబోపై డౌట్స్ ..?
ఏదేమైనా ఈ పాట చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా ఓ రకమైన నెగెటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. అయినా అనిల్ రావిపూడితో ఇప్పుడెందుకు అని చాలామంది ఫీలవుతున్న టైమ్ లో ఇలాంటి పాట రావడంతో ఆ నెగెటివ్ ఫీలింగ్ మరింత పెరిగింది. అలాగే ఎన్టీఆర్ కూడా అనిల్ రావిపూడి విషయంలో రాంగ్ స్టెప్ వేస్తున్నాడా అనే ఫీలింగ్ కూడా పెరిగిపోయింది. చూద్దాం.. మరి తర్వాత పాటలు, టీజర్ తో కూడా అనిల్ రావిపూడిలో ఎలాంటి మార్పూ లేదంటే అసలుకే ఈ కాంబినేషన్ పైనే ప్రభావం పడుతుంది.
