సూర్య హిట్ ట్రాక్ ఎక్కాడు
సూర్య కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. బట్ ఈ 2026 మనోడికి ఓ రేంజ్ లో కలిసొచ్చింది. ఏకంగా ఒకే యేడాదిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఆల్రెడీ రెండు సినిమాలు విడుదలైన బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరోటి నవంబర్ 6న విడుదల కాబోతోంది. ఈ యేడాది మే 15న కరుప్పు(తెలుగులో వీర భద్రుడు) విడుదలైంది. అనూహ్యంగా ఇది ఈ యేడాది హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. సూర్యకు ఇది బిగ్గెస్ట్ రిలీఫ్ అనే చెప్పాలి. విశేషం ఏంటంటే.. ఈ మూవీలో మరీ అంత గొప్పగా ఉన్న ఎలిమెంట్స్ లేవు. ఇంకా చెబితే దర్శకుడు ఆర్.జే బాలాజీ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో అతనే హైలెట్ అయ్యాడు.
విశ్వనాథ్ అండ్ సన్స్ తో మరో బ్లాక్ బస్టర్
సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్ట్ 14న విడుదలైంది. ఇదీ కూడా చాలా పెద్ద విజయం సాధించింది. తెలుగు దర్శకుడు, నిర్మాత కలిసి తీసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కంటెంట్ పరంగా మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇక ఈ యేడాదే నవంబర్ 6న అతను నటించిన ‘సీన్’ అనే మూవీ కూడా విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి విడుదలైన టీజర్ కు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.
సూర్య 50వ సినిమాకు దర్శకుడెవరు
సూర్య ప్రస్తుతం 50వ సినిమాకు దగ్గరలో ఉన్నాడు. 50వ సినిమా అంటే ఎవరికైనా ఓ మెమరబుల్ మేటర్ కదా. అందుకే ఈ చిత్రాన్ని ఎవరి డైరెక్షన్ లో చేయాలా అని ఆలోచించిన సూర్య.. మణిరత్నం అయితే బావుంటుంది అని ఫీలయ్యాడు. ఆ మేరకు మణిరత్నం కూడా సూర్యతో ఓ మూవీ చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. సో.. ఇద్దరి వేవ్ లెంగ్త్ కలిసింది. అందుకే ఈ కాంబోలో సూర్య 50వ సినిమా రావడం ఖాయం అని అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సూర్య, మణిరత్నం ఇద్దరి మధ్య కథా చర్చలు సాగుతున్నాయట. మరి కథ ఓకే అయితే ఈ కాంబోలో మూవీ ఉంటుంది. లేదంటే మరో దర్శకుడెవరైనా మంచి కథతో వస్తే అతనికే ఆఫర్ ఇచ్చే అవకాశాలున్నాయి సూర్యకి.
