విజయ్ ఈ సారి హిట్ కొడతాడా..?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రణబాలి. రణబాలిపై భారీ అంచనాలైతే ఉన్నాయి. యధావిధిగా విజయ్ దేవరకొండ మూవీ అనగానే చాలామంది కాచుక్కూర్చుంటారు కదా. నెగెటివిటీ స్ప్రెడ్ చేయడమే వారి పని. ట్రోల్స్, మీమ్స్ తో రెచ్చిపోతుంటారు. అతన్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తుంటారు. ఇవన్నీ కామన్. అన్నీ దాటుకుంటూ కూడా విజయ్ దేవరకొండ మూవీ అనగానే ప్రతిసారీ ఎక్స్ పెక్టేషన్స్ బాగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా అతని సినిమాలు ఉండటం లేదు. అదో పెద్ద లోపం.
రణబాలిపై భారీ అంచనాలు
విజయ్ దేవరకొండ ఇప్పుడు రణబాలిగా వస్తున్నాడు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన మూవీ. రష్మిక మందన్నా హీరోయిన్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇప్పుడు భార్య భర్తలు కూడా. కాబట్టే ఈ సారి అందరి చూపూ ఆ జంటపై కూడా ఉంటుంది. బట్ ఈ సారి డిజప్పాయింట్ చేయరు అనే నమ్మకం మాత్రం చాలామందిలో ఉంది.
రణబాలి కథేంటీ..?
రణబాలి స్వాతంత్ర్య పూర్వం జరిగే కథ. 1876-1878 మధ్య సాగే కథ. ఆ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ అంతా తీవ్రమైన కరవుతో అల్లాడుతుంది. చాలామంది ఆకలి చావులకు గురవుతుంటారు. ఆ టైమ్ లోనే బ్రిటీష్ వాడు రైల్ ట్రాక్ స్టార్ట్ చేస్తారు. ఇలా కరవుతో అల్లాడుతున్న జనాలందరినీ పనిలోకి తీసుకుంటారు. బట్ వారికి సరైన ఆహారం కూడా పెట్టరు. ఈ కారణంతో వారంతా తిరుగుబాటు చేస్తారు. వారిపై విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటారు బ్రిటీష్ వారు. ఆ టైమ్ లో అందరినీ కాపాడే ఓ యోధుడుగా రణబాలి అడుగుపెడతాడు. బ్రిటీష్ వారిని గడగడలాడించేలా యుద్ధం మొదలు పెడతాడు. మరి తర్వాతేమైంది అనేది మిగతా కథ.
విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ యోధుడు అవుతాడా..?
మరి ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. బట్ ఈ సారి విజయ్ దేవరకొండ ఖచ్చితంగా ఓ హిట్ కొట్టబోతున్నాడు అనేది చాలామందిలో కనిపిస్తోన్న అభిప్రాయం. మరి వీరందరి అభిప్రాయానికి తగ్గట్టుగా విజయ్ దేవరకొండ విజయం సాధిస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.
