విజయ్ దేవరకొండకు హిట్ అవసరం
విజయ్ దేవరకొండ ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. డిఫరెంట్ కథలతో ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. అలాంటి తను ఈ సారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేశాడు. రణబాలి టైటిల్ తో వస్తోన్న ఈ మూవీ ఈ నెల 16న విడుదల కాబోతోంది. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. రణబాలి ప్రమోషన్స్ విషయంలో కాస్త స్ట్రాంగ్ గా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ ఖచ్చితంగా ఈ మూవీతో విజయాన్ని అందుకోబోతున్నాడు అనిపించేలా ప్లాన్ చేస్తున్నారు.
స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో రణబాలి
రణబాలి స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగే కథ అని ముందు నుంచీ చెబుతున్నారు. అయితే ఇందులో ఓ చిన్న మార్పు కనిపిస్తోంది. ఇది 1876 -1878 మధ్య సాగే కథ. ఆ టైమ్ లో మద్రాస్ ప్రెసిడెన్సీ తీవ్రమైన కరవు వచ్చింది. ఓ వైపు బ్రిటీష్ వారి ఆగడాలు, మరోవైపు కరవుతో నాటి ప్రజలు అల్లాడిపోయారు. చారిత్రకమైన ఆధారాలను బట్టి చూస్తే కోటిమందికి పైగా చనిపోయారు అని చెబుతున్నారు. దీనిపైనే దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఫోకస్ చేశాడు. వీటి గురించే ముందుగా డాక్యుమెంటరీస్ రూపంలో ఆడియన్స్ కు చెబుతున్నారు.
డాక్యుమెంటరీస్ తో అవగాహన పెంచుతున్న విజయ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాతో పాటు దర్శకుడు కూడా ఈ డాక్యుమెంటరీస్ గురించి వివరిస్తోన్న విధానం బావుంది. ఓ రకంగా స్వాతంత్ర్య పోరాటం అనగానే చాలామందికి ఓ అవగాహన ఉంటుంది. ఆ మేరకు ఆడియన్స్ ప్రిపేర్ అవుతారు. బట్ అందుకు భిన్నమైన కథ కాబట్టి ఆ క్రమంలో ఈ డాక్యుమెంటరీస్ రూపంలో ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్నారు వీరు. ఇది ఖచ్చితంగా సినిమాకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది.
మానవీయ కోణంలో రణబాలి కథనం
ఆ కాలంలో వచ్చిన కరవు, బ్రిటీష్ వారి దౌర్జన్యాల నేపథ్యంలో అత్యంత మానవీయ కోణంలో సాగే సినిమా అన్నట్టుగా వీరు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ కారణంగానే జనాలకు ఈ మేరకు సిద్ధం అయ్యే సినిమా చూస్తారు అనేది తెలుస్తోంది. ద మమ్మీలో విలన్ గా కనిపించిన ఆర్నాల్డ్ వోస్లూ పాత్ర కూడా ఇందులో కీలకంగా ఉండబోతోంది. ఎలా చూసినా స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులో ఉంటుందనేలా ఇప్పటికే సంకేతాలు పంపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా సినిమాకు ఓ పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. అందులో ఏ సందేహమూ లేదు అనే చెప్పాలి.
విజయ్ దేవరకొండకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, ఆర్నాల్డ్ వోస్లూతో పాటు టెక్నికల్ గా ఈ చిత్రానికి మరో బిగ్గెస్ట్ ఎసెట్ అజయ్ – అతుల్ సంగీతం. వీరు సంగీతం ఇచ్చిన ఆల్బమ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆయా సినిమాలు మరో స్థాయికి వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా కథ బాగా నచ్చితే వీరు మ్యూజిక్ ఇవ్వడానికి సిద్ధం అవుతారు. అది రణబాలికి మరో ప్లస్ పాయింట్. ఏదేమైనా రణబాలితో విజయ్ దేవరకొండ మంచి విజయం సాధించబోతున్నాడు అనిపించేలా ఉంది.
