ప్రభాస్ దూకుడు
ప్రభాస్(Prabhas) నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్నాడు. కమిట్మెంట్ కు భిన్నంగా ఉన్నా.. సినిమాల విషయంలో మాత్రం ఇంతకు ముందులా ఆలస్యం లేదు. ఫౌజీ(Fauji) ఆల్మోస్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా సాగుతున్నాయి. ఇంకా కొంత చిత్రీకరణ ఉంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ మూవీ కూడా రూపొందుతోంది. స్పిరిట్ కోసం ముందే ఇచ్చిన డేట్స్ కు తగ్గట్టుగా దూసుకుపోతున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. 2027 మార్చి 5న స్పిరిట్ విడుదల కాబోతోంది.
స్పిరిట్ తర్వాతే ఫౌజీ విడుదల
ప్రభాస్ నుంచి.. ముందుగా స్పిరిట్ విడుదల చేయాలనుకున్నారు. తర్వాతే ఫౌజీ ఉంటుందని టాక్. ఇక ఈ రెండిటితో పాటు కల్కి 2 కూడా ఉండబోతోంది. ఇప్పటికే కల్కి 2 చిత్రీకరణ సాగుతోంది. కాకపోతే ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా కల్కి 2 లో విలన్ పాత్ర చేస్తున్న కమల్ హాసన్(Kamal Haasan) పై చిత్రీకరణ చేస్తున్నారు. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2పై ఇప్పటి వరకు కామ్ గానే ఉన్నాడు కానీ.. ఒక్కసారి స్టార్ట్ అయితే దూకుడు పెంచాలని భావిస్తున్నాడు.
ప్రభాస్ పై నాగ్ అశ్విన్ ఒత్తిడి
నాగ్ అశ్విన్(Nag Aswin) కూడా ప్రభాస్ పై ఒత్తిడి చేయబోతున్నాడు. నాగ అశ్విన్ ఇప్పటి వరకు కల్కి 2 విషయంలో ప్రభాస్ పై ఒక పది శాతం చిత్రీకరణ చేశాడు. ఓవరాల్ గా 30శాతం వరకు షూటింగ్ అయిపోయిందట. మేజర్ గా ప్రభాస్ పై షూటింగ్ విషయంలో ఈ యేడాది డిసెంబర్ నుంచి 2027 ఏప్రిల్ వరకు కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట. మధ్యలో స్పిరిట్, ఫౌజీ ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. 2027 సమ్మర్ వరకు ముందే కల్కి 2 చిత్రీకరణ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. సమ్మర్ లో ప్రభాస్ ఎలాగూ యూరప్ లో ఉంటాడు కాబట్టే ఈ ప్లాన్ చేస్తున్నారట.
2027 దసరా బరిలో కల్కి2
కల్కి 2 చిత్రాన్ని 2027 దసరా బరిలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. దసరా కుదరకపోతే డిసెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారట. అయితే మరీ ఒక్క యేడాదిలోనే మూడు సినిమాలు విడుదల చేస్తే బావుండదు అని భావిస్తే అప్పుడు ఖచ్చితంగా 2028 సంక్రాంతి బరిలో కల్కి2 చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. బట్ రిలీజ్ డేట్ విషయంలో పక్కాగా 2027 స్టార్టింగ్ లోనే డిసైడ్ అవుతారట. డిసైడ్ అవగానే వెంటనే అనౌన్స్ మెంట్ కూడా ఉండబోతోందని టాక్. ఏదేమైనా ప్రభాస్ దూకుడు మాత్రం ఇంకా పెంచాల్సి ఉంది.. ముఖ్యంగా కల్కి 2 విషయంలో.
