నాని ఫస్ట్ డే కలెక్షన్స్
నాని హీరోగా నటించిన ద ప్యారడైజ్ మూవీ యూనానిమిస్ డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. ఫస్ట్ హాఫ్ బానే ఉంది అని చెబుతున్న వాళ్లు కూడా సెకండ్ హాఫ్ పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా చెబితే ద ప్యారడైజ్ ఏ దశలోనూ బావున్న సినిమా కాదు అని కూడా మెజారిటీ ఆడియన్స్ చెబుతున్నారు. బట్ కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయి. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు 88 కోట్లు వచ్చాయి అని నిర్మాతలు ప్రకటించారు. బట్ కరెక్ట్ లెక్క అంటే మాత్రం మొదటి రోజు 55-60 కోట్లు వచ్చినట్టుగా రికార్డ్స్ చెబుతున్నాయి. బట్ 88 అని చెప్పారు కాబట్టి నానికి ఇదే హయ్యొస్ట్ ఓపెనింగ్ అనే చెప్పాలి.
ప్యారడైజ్ తో అభాసుపాలైన నాని
నాని మూవీ కాబట్టి కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నా.. ఫర్వాలేదు అని ఇప్పటి వరకు చాలాసార్లు అనుకున్నారు. కానీ ద ప్యారడైజ్ విషయంలో మాత్రం చెడుగుడు ఆడేస్తున్నారు. కథలో కొత్తదనం లేదు. కిచిడి మూవీలా ఉంది. కథనం చాలా పాతది. నాని అదే పనిగా నరకడం, చంపడం, ఫైట్లు చేయడం తప్ప ఏమీ చేయలేదు అంటున్నారు. ఆ ఫైట్స్ లో విపరీతమైన హింస ఉండటం.. దానికి బలమైన కారణం అంటూ లేకపోవడం మరో బిగ్గెస్ట్ మైనస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
శ్రీకాంత్ ఓదెలకు మినిమం అవగాహన లేదా
శ్రీకాంత్ ఓదెల విషయంలో చూస్తే అతని ఫస్ట్ మూవీ దసరా విషయంలోనే చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ పాటలు, కీర్తి సురేష్, విలన్ క్యారెక్టరైజేషన్ వరకు ఓకేగా ఉండటంతో పాటు నాని ఇమేజ్ కి ఇది కొత్త ప్రయత్నం అని భావించి సినిమాను హిట్ చేశారు ఆడియన్స్. బట్ ఈ సారి అలాగేం అనుకోలేదు. అందుకే నాని హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ గురించి బ్యాడ్ గానే చెబుతున్నారు. అంటే అందుకు ప్రధాన కారణం శ్రీకాంత్ ఓదెల.
శ్రీకాంత్ ఓదెల తీసుకున్న పాయింట్ బానే ఉంది. అణచివేతకు గురైన ఒక తెగ తమకంటూ ఓ గుర్తింపు కావాలి అంటూ ఏళ్ల తరబడి ఎదురుచూడటం.. ఎదుర్కోవడం వరకు బావుంది. బట్ ఈ పాయింట్ ను ఎగ్జిక్యూట్ చేయడంలోనే చాలా అంటే చాలా తప్పులు ఉన్నాయి. అణచివేతకు గురైన తెగ తిరుగుబాటు చేయడం అనేది అందరికీ తెలిసింది. కానీ సినిమా చివరి వరకు ఆ తిరుగుబాటు లేకుండా ఉండటం.. లెక్కకు మిక్కిలి చావులుండటం.. అలాగే ఆ తెగ వాళ్లంతా హీనంగా ఉంటే హీరో మాత్రం కాస్ట్ లీ బట్టలు కట్టుకోవడం.. స్టైలిష్ గా ఉండటం అస్సలు సెట్ కాలేదు. అలాగే సినిమా అంతా వానకాలంలో సాగినట్టుగా చూపండం సింబాలిక్ గా ఉంటుందనుకోవడం అంటే అంతకు మించిన మూర్ఖత్వం మరోటి లేదు.
నాని కటౌట్ కు సెట్ కాని కథ, కథనం
నాని కటౌట్ కి మినిమం కూడా సెట్ కాని ఫైట్లు మరో మైనస్. నిజానికి మాస్ హీరో అయ్యేంత స్టేచర్ నానికి అస్సలు లేదు. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం వరకే అతనికి సెట్ అవుతుంది. కాదని మాస్ హీరో అనిపించుకోవాలని ఆరాటపడటం చూస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నాని ఇది ఓ ఫిక్షన్ మూవీలాంటిది అన్నాడు. ఫిక్షన్ అన్నప్పుడు అలాగే ఉండాలి. కాదంటే మళ్లీ కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు తేవడం.. పైగా కేసీఆర్ వల్లే తమకు గుర్తింపు వస్తుందని చెప్పడం చూస్తే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలలో విషయం లేదు అనేది అర్థం అవుతుంది.
తెలంగాణ అంటే అనేక పోరాటాలకు పెట్టింది పేరు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన నేల. అలాంటి నేలలో 1980ల వరకు ఇలాంటి మనుషులు ఉన్నారు చెప్పడం అంటే దర్శకుడు అసలు తెలంగాణ మీద కనీస అవగాహన కూడా అనేది తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి మూవీస్ కు ఓ ఐడెంటిటీ కోసం పోరాటం అనేది కామన్ పాయింట్. ఆ కామన్ పాయింట్ చుట్టూ బలమైన కథనం అల్లుకోవాల్సింది పోయి ఫైట్లు, కత్తులు, తుపాకులు అంటూ నేల విడిచి సాము చేయడం చేస్తే ఫలితం ప్యారడైజ్ అవుతుంది.
