చిరంజీవి కాకా గ్లింప్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మూవీ కాకా. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఇది. అనస్వర రాజన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరి చిరంజీవికి జోడీగా ప్రియమణి నటిస్తోంది. ఈ కాంబినేషన్ చాలా బావుంది అనే టాక్ కూడా ఉంది. చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మెగాస్టార్ మరోసారి మాస్ అండ్ క్లాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనిపించేలా ఉంది ఈ గ్లింప్స్.
చిరంజీవి మెగా దూకుడు
చిరంజీవి మూవీస్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. దర్శకుడు కాస్త అలసత్వం చూపినా ఆయనకు నచ్చదు. ఉదయం 7 గంటలకు షాట్ అంటే షాటే. ఆ టైమ్ కు మించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు. అందుకే కాకా షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ మూవీ ఏకంగా 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందట. అంతేనా.. ఏకంగా దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. దీంతో పాటు డబ్బింగ్ కూడా మొదలు పెట్టామని రీసెంట్ గా దర్శకుడు బాబీ అప్డేట్ ఇచ్చి ఒక వీడియో కూడా విడుదల చేశాడు.
బాబీ దర్శకత్వంలో కాకా
చిరంజీవి, బాబీ కాంబినేషన్ గతంలో వాల్తేర్ వీరయ్య వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ అయింది. ఆ మ్యాజిక్ ను కాకాతో కూడా రిపీట్ చేయబోతున్నారు అనిపించేలా ఉంది. వాల్తేర్ వీరయ్యలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేశాడు. మరి కాకాలో కూడా అలాంటి పాత్ర ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే అనస్వర రాజన్ పాత్ర చాలా ముఖ్యంగా ఉండబోతోందని తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నాడు. ఏదేమైనా కాకా మూవీ 2027 సంక్రాంతి బరిలో ఉంది. ఆల్రెడీ జనవరి 12న విడుదల అని ప్రకటించారు కూడా. ఆ టైమ్ కు హ్యాపీగా రిలీజ్ చేయడం ఖాయం అని ఈ దూకుడు చూస్తుంటేనే అర్థం అవుతోంది.
