అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ క్రేజీ కళ్యాణం. భద్రప్ప గాజుల డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఈ నెల 16న విడుదల కాబోతోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీమ్. అనుపమ పరమేశ్వరన్ కు జోడీగా రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ కార్తీక్ రాజ్ నటిస్తున్నాడు. టీజర్ చూస్తేనే ఇందులో కార్తీక్ కంటే తరుణ్ భాస్కర్ హైలెట్ కాబోతున్నట్టుగా కనిపించింది. అనుకున్నట్టుగానే ట్రైలర్ చూస్తే చాలు.. ఈ సారి అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ఇద్దరూ ఇరగ్గొట్టేయబోతున్నారు అనిపిస్తుంది.
క్రేజీ కళ్యాణం ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది
క్రేజీ కళ్యాణం ట్రైలర్ చాలా ప్రామిసింగా ఉంది. కథలో కొత్తదనం లేదు కానీ కథనంతో మాత్రం చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నరేష్ కు కూడా ఈ మూవీతో మరోసారి అద్భుతం అనిపించడం ఖాయం అనిపిస్తోంది. నరేష్ కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు భర్త తరుణ్ భాస్కర్. అతనో పచ్చి తాగుబోతు. అదే పనిగా ఆ పనిలోనే ఉంటుంటాడు. దీంతో రెండో కూతురు అయిన అనుపమ పరమేశ్వరన్ కు అయినా ఓ మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే అనుపమ పరమేశ్వరన్ కార్తీక్ రాజ్ తో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమను కాదని.. ఓ అమెరికా సంబంధం తెస్తాడు నరేష్.
తరుణ్ భాస్కర్ కు మంచి క్యారెక్టర్ పడింది.
అమెరికా అబ్బాయితో పెళ్లికి అనుపమ పరమేశ్వరన్ నో చెబుతుంది. అయినా అతను పట్టుబడుతుంటాడు. ఈ టైమ్ లో సీన్ లోకి తరుణ్ భాస్కర్ ఎంటర్ అవుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ చాలా బావుంది. సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తే.. మంచి విజయం రావడం ఖాయంగా ఉంది. బట్ అదే రోజున విజయ్ దేవరకొండ రణబాలి కూడా ఉంది. దాన్ని దాటుకుని నిలబడాలి అంటే క్రేజీ కళ్యాణం మూవీ కూడా క్రేజీగానే ఉండాలి. అప్పుడే ఈ మూవీ కూడా హిట్ అవుతుంది.
