ఆగస్ట్ లో అదిరిపోయే సినిమాలు

టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ లో ఊహించినన్ని విజయాలు మాత్రం రాలేదు. సంక్రాంతి బరిలో విడుదలైన మూవీస్ అన్నీ యధావిధిగా విజయం సాధించాయి. తర్వాత సమ్మర్ లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఓ మూడు నాలుగు మాత్రమే హిట్ అనిపించుకున్నాయి. జూన్ లో వచ్చిన పెద్ది, మా ఇంటి బంగారం మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన జూలైలో లెనిన్ తో ఊపు మొదలైంది. ఈ నెల చివర్లో విడుదల కాబోతోన్న శ్రీనివాస మంగాపురంపై అంచనాలున్నాయి. అయితే ఆగస్ట్ లో మాత్రం మాగ్జిమం ప్రామిసింగ్ మూవీస్ అనిపించుకున్న చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
ఆగస్ట్ 7న వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు విడుదల కాబోతోంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఆ మధ్య విడుదలైన టీజర్ తో ప్రామిసింగ్ అనిపించుకుంది. హారర్ కామెడీ జానర్ లో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. కానీ ఓటిటి, శాటిలైట్ డీల్స్ సెట్ కాక ఆలస్యం అయింది. ఫైనల్ గా ఈ డీల్స్ ఓకే అయ్యాయి కాబట్టి ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ మూవీ. మరి ఈ మూవీతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు.
ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య ఫస్ట్ టైమ్ చేసిన తెలుగు స్ట్రెయిట్ మూవీగా ఇది ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్. సితార బ్యానర్ లో రూపొందిన సినిమా ఇది. టీజర్ తో బాగా ఆకట్టుకుంది. చాలా యేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇది చాలా పెద్ద విజయం అందిస్తుందని చాలామంది అనుకున్నారు. బట్ ఈ లోగానే వీరభద్రుడుతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు సూర్య. దీంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో రాబోతున్నాడు.
ఇక ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది ఇరుముడి మూవీ. రవితేజ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ తో రూపొందుతున్న సినిమా ఇది. అయ్యప్ప మాలలో అతను విడుదల చేసిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ఇది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం. ఈ మూవీతో రవితేజ మంచి విజయం సాధించేలానే ఉన్నాడని చాలామంది భావిస్తున్నారు.
ఆగస్ట్ 26న విడుదల కాబోతోన్న మూవీ టాక్సిక్. యశ్ హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఈ డేట్ కు రావడం కూడా కష్టమే అనుకున్న టైమ్ లో రీసెంట్ గా విడుదల చేసిన పాటతో మొత్తం సోషల్ మీడియాను హీటెక్కించారు. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సితారియా, రుక్మిణి వసంత్ లాంటి బ్యూటీస్ కూడా నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యశ్ చేసిన ఈ మూవీపై ప్యాన్ ఇండియన్ రేంజ్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇక ఆగస్ట్ 28న విడుదల కాబోతోన్న మూవీ భోగీ. శర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తోన్న మూవీ ఇది. శర్వానంద్ రగ్ డ్ లుక్ తో కనిపిస్తున్నాడు. 1960స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా ఇది ఉండబోతోందని ముందే చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఇదే డేట్ కే రావడం ఖాయమా లేక మరో కొత్త డేట్ కు వస్తుందని కూడా చూడాలి. మొత్తంగా ఈ ఆగస్ట్ ప్రతి వారం ఒక ప్రామిసింగ్ మూవీతో ఆడియన్స్ కు మంచి జోష్ ఇచ్చే ఇవ్వబోయేలా ఉందని చెప్పొచ్చు.

Continue reading
పెద్ది ఓటిటిలోకి వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్దికి ఓటిటి డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ప్యాన్ ఇండియా హీరోగా చెప్పినా కేవలం తెలుగులో మాత్రం మెప్పించగలిగిందీ మూవీ. సౌత్ లోని ఇతర భాషల్లో జనం పట్టించుకోలేదు. అలాగే నార్త్ అస్సలు చూడలేదు. తెలుగులో మాత్రమే హిట్ అని చెప్పగలిగారు. అయితే రామ్ చరణ్ నటన విషయంలో మాత్రం యూనానిమస్ అంతా ఒకటే చెప్పారు. అద్భుతంగా నటించాడు అని. అలాగే జాన్వీ కపూర్ ఎపిసోడ్ విషయంలో బుచ్చిబాబు రైటింగ్ వరస్ట్ గా ఉందనే టాక్ కూడా వచ్చింది. దీంతో పాటు పాత్రలను ఇంకాస్త బలంగా రాసి ఉంటే బావుండేది అని కూడా అన్నారు. కేవలం రామ్ చరణ్ పైనే ఫోకస్ చేయడం.. అందులో మూడు ఆటలతో అంటే జనం విసిగిపోయారు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే చాలాకాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో ఇచ్చిన సంగీతానికి వంద మార్కులు పడ్డాయి. అతని వర్క్ సింప్లీ సూపర్బ్ అని చెప్పారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది.
ఈ నెల 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది పెద్ది. మామూలుగా థియేటర్స్ లో ఆడకపోయిన మూవీస్ కు ఓటిటిలో మంచి అప్లాజ్ వస్తుందనే దశ కూడా దాటేశారు. ఇప్పుడు థియేటర్ రిజల్ట్స్ ఓటిటిలో కూడా రిపీట్ అవుతున్నాయి. ఆ కారణంతో పెద్దికి కేవలం తెలుగులో మాత్రమే పాజిటివ్ టాక్ వస్తుంది లేక ఇతర భాషల్లో కూడా ఆడుతుందా అనేది చూడాల్సిందే.

Continue reading
బాలయ్య, ప్రభాస్, విజయ్.. డిసెంబర్ లో వచ్చేదెవరు..?

నందమూరి బాలకృష్ణ అప్డేట్

ఈ యేడాది డిసెంబర్ మంచి డిమాండ్ లో ఉండబోతోంది అనిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య నటిస్తోన్న మూవీ డిసెంబర్ లో విడుదల కాబోతోంది అని చెబుతున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్ తోనే అదరగొట్టాడు. అదీ కాక బాలయ్య విగ్ సెట్ అయితే సినిమా హిట్ అనే టాక్ కూడా ఉంది కదా. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయడానికి మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ కూడా పూర్తి కావొస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు ప్రమోషన్స్ కు కావాల్సినంత టైమ్ ఉంది. అదీ కాక బాలయ్య ఈ మూవీ తర్వాత ఆగస్ట్ నుంచే కొరటాల శివ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడు. అంటే ఆగస్ట్ వరకు గోపీచంద్ మూవీ కంప్లీట్ అవుతుంది. అందుకే బాలయ్యకు బాగా కలిసొచ్చినా డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ప్రభాస్ ఫౌజీ మూవీ

ఇక రాజాసాబ్ లాంటి డిజాస్టర్ చూసిన ప్రభాస్ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ముందుగా రావాల్సిన సినిమా ఫౌజీ. బట్ ఈ మూవీ గురించి మినిమం అప్డేట్స్ కూడా ఏం లేవు. అసలు వస్తుందా లేదా అనేది కూడా తెలియకుండా పోయింది. ఈ మూవీ టీమ్ నుంచి ఎలాంటి విషయాలు కూడా తెలియకుండా ఉన్నారు. ఆ కారణంగా ఈ చిత్రం అసలు ఈ యేడాది విడుదలవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా కొందరు మాత్రం ఈ చిత్రాన్ని ఈ యేడాది డిసెంబర్ 3న విడుదల చేస్తారు అని చెబుతున్నారు. ఆ కొందరు అనేది ఎవరికీ తెలియదు. బట్ ఇప్పటికైతే ఫౌజీని డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నారు అనే రూమర్ ఉంది.

విజయ్ దేవరకొండ రణబాలి

ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న మూవీ రణబాలి. రష్మిక మందన్నా హీరోయిన్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో రాబోతోంది. ఈ మూవీ విషయంలో విజయ్ దేవరకొండ చాలా సీరియస్ గా ఉన్నాడు. ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అదీ కాక రష్మిక మందన్నా ఈ మధ్య చేసిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్స్. అలాంటి ఇద్దరూ పెళ్లి తర్వాత చేస్తోన్న మూవీ ఇది. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 11నవిడుదల అన్నారు. తర్వాత అక్టోబర్ కు వాయిదా వేశారు. బట్ ఈ వాయిదా కూడా ఆగిపోయేలా ఉందట. ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇక నాని నటిస్తోన్న ద ప్యారడైజ్ కూడా డిసెంబర్ లోనే విడుదల కాబోతోందంటున్నారు. వీళ్లు ఇప్పటికే రిలీజ్ డేట్ మార్చారు. ఇంకా కొత్త డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. మరి వీళ్లు కూడా డిసెంబర్ లో వస్తే.. ఈ నెల టాలీవుడ్ కు మాంజి జోష్ గా ఉంటుందేమో.

 

Continue reading
రామ్ పోతినేని రఫ్పాడిస్తాడా..?

రామ్ పోతినేని(Ram Pothineni) కొన్నాళ్లుగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. సరైన సినిమాలు పడటం లేదు. వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశనే పరుస్తున్నాయి. చివరగా ఆంధ్రాకింగ్ తాలూకాతో నటనతో మెప్పించాడు కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని తనే స్వయంగా రంగంలోకి దిగాడు. డెబ్యూ డైరెక్టర్ గా ఫస్ట్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ రేపటి నుంచి(29.06.2026) ప్రారంభం కాబోతోంది.
ఈ చిత్రానికి దర్శకుడే కాదు నిర్మాత కూడా తనే. కృష్ణ పోతినేని నిర్మాణంలో రాపో సినిమాటిక్ అనే బ్యానర్ స్థాపించాడు. ఆ బ్యానర్ లోనే రాపో ఫస్ట్ డైరెక్షన్ మూవీ రాబోతోంది. ఈ మూవీలో అతని పాత్రను ‘వీరా’గా ఆల్రెడీ చెప్పారు. ఆ పాత్రకు తగ్గట్టుగా గెటప్ కూడా ఉండబోతోంది అనిపించేలా ఓ లుక్ కూడా విడుదల చేశారు. మొత్తంగా రామ్ పోతినేని ఈ కథ విషయంలో చాలా సీరియస్ గా ఉండబోతున్నాడు అనిపించేలా ఉన్నాడు. మరిఈ మూవీలో హీరోయిన్ ఎవరు.. ఇతర కాస్టింగ్ ఎవరు అనేది రేపు తెలుస్తోందేమో.

Continue reading