Gaaradi Telugu news logo

ప్రేమ్ కుమార్.. 96, సత్యం సుందరంల దర్శకుడు

ప్రేమ్ కుమార్.. 96, సత్యం సుందరం సినిమాలతో తెలుగువారిని కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఆ రెండు సినిమాల్లో హృద్యమైన కథ, కథనాలున్నాయి. అలాగని ఇవేమీ భారీ బడ్జెట్ సినిమాలు కాదు. సాధారణమైన బడ్జెట్ లో అద్బుతమైన రికార్డులు క్రియేట్ చేశాడు. 96 మూవీకి గోవింద వసంత్ అందించిన సంగీతం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుంది. అఫ్ కోర్స్ అతనే సత్యం సుందరం కూడా సంగీతం అందించాడు. బట్ 96 పాటలు తమిళ్ లో విన్నా కూడా వినాలనే అనిపిస్తుంది. మరి ఈ ఇద్దరూ కలిసి మరోసారి మరో మూవీకి రెడీ అయ్యారంటే చాలా విశేషమే కదా.

విక్రమ్ తో మూవీ ఆగిపోయిందా..?

ప్రేమ్ కుమార్ ఈ రెండు సినిమాల తర్వాత ఈ సారి యాక్షన్ కథతో రావాలనుకున్నాడు. హీరోగా విక్రమ్ ను అనుకున్నాడు. కథ చెప్పాడు. విక్రమ్ కూడా ఒప్పుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. మరి సడెన్ గా ఏమైందో కానీ సీన్ లోకి ఫహాద్ ఫాజిల్ వచ్చాడు. నటుడుగా ఫహాద్ ఫాజిల్ గురించి చెప్పేదేముందీ. అతనో ఫైనెస్ట్ యాక్టర్. కట్ చేస్తే ఈ ముగ్గురూ కలిసి ది బెస్ట్ కాంబినేషన్ గా మారారు.

ఫహాద్ ఫాజిల్ తో క్లాసా.. మాసా..

ప్రేమ్ కుమార్, గోవింద వసంత్ ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నారు అనేది చాలామంది ఈగర్ గా ఎదురుచూస్తున్న విషయం. ఈ కథలో ఫహద్ ఫాజిల్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది ఫజిల్ గా మారింది. ప్రేమ్ కుమార్ తన గత రెండు చిత్రాల్లాంటి కథతో వస్తాడా లేక అతను అనుకుంటున్నట్టుగా యాక్షన్, థ్రిల్లర్ కథతో వస్తాడా అనేది వేచి చూడాల్సిందే. బట్ ఏదేమైనా ఈ ముగ్గురి కాంబినేషన్ గురించి కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కడి సోషల్ మీడియాలో ఈ కాంబో గురించి ఓ రేంజ్ లో పొగుడుతూ మాట్లాడుతున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి