Gaaradi Telugu news logo

చంద్రబాబు నిస్సిగ్గుతనం

చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఆరితేరిన వాడు. చంద్రబాబు వారసుడుగా రాజకీయాల్లో ఎదుగుతున్న లోకేష్. ఇక చంద్రబాబునే నమ్ముకుని పార్టీని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్.. ఈ ముగ్గురూ ముగ్గురే. అంటే ఏదో గొప్ప అని కాదు. ముగ్గురూ నిస్సిగ్గుగా రాజకీయం చేస్తున్నారు. కూటమిగా కూడి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతకు ముందు జగన్ వైసీపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కి తీవ్రమైన అన్యాయం జరిగింది అదే పనిగా ప్రచారాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అన్యాయాలు చేయడం జగన్ ను మించిపోయారు.

ఏపిలో పాతరైన ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి సామరస్యంగానే ఉండాలి. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఈ సామరస్యం అనేది పూర్తి స్థాయిలో కనిపించలేదు. కానీ ఇప్పుడు అత్యంత హేయమైన స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఏపిలోని స్థానిక ఎన్నికల విషయం కూటమి చేస్తోన్న జుగుప్సాకరమైన రాజకీయాలు చూసి దేశమంతా ముక్కున వేలేసుకుంటోంది. ముఖ్యంగా వైసీపి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను కనీసం నామినేషన్ వేయడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలీస్ లు కూడా ఏం చేయలేని స్థితిలో కూటమి అభ్యర్థలకే సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తే ఏపి మరో బిహార్ అయిపోయింది అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.

జనసేనపైనా టిడిపి దాడులు

విశేషం ఏంటంటే.. కూటమిలో ఉన్న జనసేన అభ్యర్థులపై కూడా టిడిపి నేతలు దాడులు చేస్తున్నారు. ఓ వైపు పొత్తు ధర్మం అని చెబుతూనే ఆ ధర్మాన్ని దాటి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చాలామంది జనసేన అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా భయపడుతున్నారు అంటే తెలుగుదేశం ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో చెప్పనలవి కాదు.
పవన్ కళ్యాణ్ ఓ వైపు కూటమి గొప్పది అని నీతి సూత్రాలు వల్లిస్తున్నాడు. ఇటు చూస్తే జనసేన వారిపై తెలుగుదేశం దాడులను కనీసం ఖండించడానికి కూడా ఆయన మనస్కరించడం లేదు. నాదెళ్ల మనోహర్ అయితే ఇంకా టిడిపినే సపోర్ట్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అంతా దారుణంగా ఉంటే.. ఏవో చెదురు ముదురు ఘటనలు అన్నంత తేలిగ్గా తీసుకుంటున్నాడు. ఓ వైపు పోలీస్ లు కూడా విసిగెత్తిపోతున్నా కూడా ఇలాగే మాట్లాడ్డం ఎంత వరకు భావ్యం.

లోకేష్ పప్పుగానే మిగిలిపోయాడా..?

ఇక లోకేష్ తానింకా పప్పుగానే ప్రవర్తిస్తున్నాడు. వైసీపి వారు ఈ దారుణాలను ఖండిస్తున్నారు. దాని గురించి విచక్షణతో మాట్లాడాల్సిన లోకేష్.. ఇంకా దిగజారిపోయి మాట్లాడ్డం చూస్తుంటే ఇది నిజంగానే ప్రజాస్వామ్యంలోని రాజ్యాంగం కాదు.. రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తోంది. ఇక చంద్రబాబు మైండ్ పోయింది. ఏం మాట్లాడుతున్నాడో అతనికే స్పష్టంగా తెలియడం లేదు. ఎంత సేపూ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప రాష్ట్రం కోసం ఆలోచించడం అనేది చంద్రబాబుకు ఏనాడూ తెలియదు.

పవన్ కళ్యాణ్ ఓ దిగజారుడు నేత

పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంత దిగజారుడు రాజకీయ నేతను ఇప్పటి వరకూ ఎవరూ చూసి ఉండరు. ఇప్పటికీ అన్ని పార్టీలను రౌండ్ వేసి వచ్చాడు. తెలుగుదేశంతో అంటకాగుడుతున్నాడిప్పుడు. జనసేన పార్టీ కంటే తెలుగు దేశం పార్టీకే ప్రాధాన్యత ఇవ్వడం.. తెలుగు దేశం పార్టీ కోసమే తన ప్రాణాలు అర్పించేంతగా దిగజారిపోయాడు. ఏదేమైనా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ రాష్ట్రం తగలబడుతోంది. రాజకీయాలు స్వార్థమే ఉంటుంది. కానీ ఇప్పుడు స్వార్థం కంటే.. కక్ష, సాధింపు చర్యలు, దౌర్జన్యం, దౌర్భాగ్యం, నిస్సిగ్గుతనం, దోపిడీ.. ఇవన్నీ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. వేకప్ ఏపీ పీపుల్.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి