Gaaradi Telugu news logo

ఎన్టీఆర్.. ఈ ట్విస్ట్ ఏంటి బాబోయో

ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి ఇప్పట్లో ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ మరో స్థాయిలో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చేస్తున్నాడు. ఇది 2027 జూన్ 11న విడుదలవుతుంది. తర్వాత త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్.. ఆపై తమిళ్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా ఉంది. అందుకే అనిల్ రావిపూడి గురించి ఈ టైమ్ లో ఎవరూ మాట్లాడలేరు అనుకున్నారు. బట్ సడెన్ గా, సర్ ప్రైజింగ్ గా ఈ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందని స్వయంగా ఎన్టీఆరే చెప్పడం షాకింగ్ గానే ఉంది.

అనిల్ రావిపూడి – ఎన్టీఆర్ కాంబోలో మూవీ

అనిల్ రావిపూడి గతంలో చాలాసార్లు చెప్పాడు. నేను ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటున్నాను. ఇప్పటికే రెండు మూడు సార్లు కలిసి కథ చెప్పాను. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. ఎప్పటికైనా ఎన్టీఆర్ తో మూవీ చేస్తాను అన్నాడు. బట్ ఇది ఈ టైమ్ లో అనౌన్స్ కావడం విశేషమే అని చెప్పాలి. అనిల్ రావిపూడి అంటే ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్. ఎన్టీఆర్ లాంటి ఓ ఊరమాస్ హీరో గతంలోనే అదుర్స్ లాంటి ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. మరి ఈ కాంబోలో మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఎంటర్టైన్మెంట్ కు కూడా అందదేమో.

త్రివిక్రమ్ షాక్ ఇవ్వబోతున్నాడా.. ఎన్టీఆర్

మామూలుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నాడు అని చాలామంది భావిస్తున్నారు. బట్ ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్ తో ఆ కాంబినేషన్ ఆగిపోతుందా అని చాలామంది చెవులు కొరుక్కుంటున్న ఈ కాంబినేషన్ బయటకు రావడం మాత్రం త్రివిక్రమ్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఏదేమైనా ఇది ఖచ్చితంగా ఓ ట్విస్టింగ్ కాంబినేషన్ అని చెప్పాలి. మరి అనిల్ రావిపూడి ఈ సారి రొటీన్ ఎంటర్టైనర్స్ ను దాటి ఎన్టీఆర్ తో కొత్తగా వినోదం పండిస్తాడా లేదా అని వేచి చూడాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి