
సూర్య హ్యాట్రిక్ కి సిద్ధం
సూర్య ఈ యేడాది మంచి దూకుడు మీద ఉన్నాడు. గత పదేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అతనికి 2026 బాగా కలిసొచ్చింది. ఆల్రెడీ కరుప్పుతో తన కెరీర్ లో బెస్ట్ హిట్ కొట్టాడు. అదీ కలెక్షన్స్ పరంగా కూడా. విశ్వనాథ్ అండ్ సన్స్ తో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘సీన్’ అనే మూవీతో ఈ నెల 6న రాబోతున్నాడు. జీతూ మాధవన్ అనే మళయాల దర్శకుడు రూపొందించిన సినిమా సీన్. నజ్రియా నజీన్, నాస్లేన్, లాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొంచెం కొత్త పాయింట్ తో వస్తున్నట్టుగా అనిపించింది. ముఖ్యంగా సూర్య పాత్ర రెండు షేడ్స్ లో ఉన్నట్టుగా ఉంది. అదే టైమ్ లో అతని ప్లేస్ లో నాస్లేన్ ఉన్నట్టుగానూ కనిపిస్తోంది.
సీన్ లో నజ్రియా, నాస్లేన్ పాత్రలేంటీ..?
సూర్య తనతో నజ్రియా నటించాలని చాలాకాలంగా అనుకున్నాను. కానీ తను ఒప్పుకోలేదు. మూడు సినిమాలకు అడిగాను. నో చెప్పింది. ఫైనల్ గా నాలుగో సినిమాగా సీన్ లో నటించేందుకు ఒప్పుకుంది అని సరదాగా చెప్పాడు. నజ్రియా ఈ చిత్రంలో ముందుగా ఓ పనిమనిషిలా కనిపిస్తూ సడెన్ గా యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇదే ట్రైలర్ లో ఉంది. ఏదేమైనా జీతూ మాధవన్ ఆవేశం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందించిన సినిమా కాబట్టి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ‘సీన్’రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.
మహాశక్తిగా నయనతార
నయనతార ప్రధాన పాత్రలో నటించిన మూవీ మహాశక్తి. ఆమె నటించిన మూకుత్తి అమ్మన్ కు ఇది సీక్వెల్. ఫస్ట్ పార్ట్ ఆర్జే బాలాజీ దర్శకత్వం చేస్తే ఈ పార్ట్ ను సుందర్ సి తెరకెక్కించాడు. ఈ మూవీ ట్రైలర్ కూడా ఓ రేంజ్ లో ఉంది. మూవీ చాలా భారీగా ఉండబోతోంది అనిపించేలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నట్టుగా అనిపిస్తోంది. నయనతార ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించబోతోంది. సాధారణ పోలీస్ పాత్రలోనూ అలాగే మహాశక్తి పాత్రలోనూ కనిపిస్తోంది. తెలుగులో పెద్దగా పట్టించుకునేలా లేదు కానీ.. తమిళ్ లో మాత్రం మహాశక్తిపై భారీ అంచనాలున్నాయి.
సూర్య వర్సెస్ నయనతార
సో.. సూర్య వర్సెస్ నయనతారగా వార్ మారింది. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనిపించుకోబోతున్నారు అనేలా ఉంది. కంటెంట్ పరంగా రెండూ భిన్నమైనవే. బట్ ఎవరు ఎక్కువ ఆకట్టుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సిందే. సీన్ తో సూర్య హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అంటున్నారు. అలాగే ఈ మధ్య సోలోగా కాస్త స్లో అయిన నయనతార మహాశక్తితో మళ్లీ ఫామ్ లోకి వస్తుంది అంటున్నారు. మరి చూద్దాం.. ఇద్దరిలో ఎవరు పెద్ద హిట్ కొట్టబోతున్నారో.
