
సాయి పల్లవి సెలెక్టివ్ గా వెళుతోంది
సాయి పల్లవి సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తోంది. వరుసగా ఏది పడితే దానికి కమిట్ కావడం సాయి పల్లవికి అలవాటు లేదు. ప్రస్తుతం తను నటించిన రామాయణ నవంబర్ 5న విడుదల కాబోతోంది. నవంబర్ 20న ఓమ్ మూవీ విడుదల కాబోతోంది. ఓమ్ రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తోన్న మూవీ. రాజ్ కుమార్ పెరియసామి అమరన్ తో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ మూవీలో తారాగణం భారీగా కనిపిస్తోంది.
పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ గా సాయి పల్లవి
సాయి పల్లవి పాత్రను పరిచయం చేస్తూ తాజాగా ఒక వీడియో విడుదల చేసింది టీమ్. ఇందులో నిత్య రెడ్డి ఐపిఎస్ పాత్రలో తను కనిపిస్తోంది. తను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ కేడర్ ఆఫీసర్ అంటూ పరిచయం చేశారు. అంతే కాదు.. తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతోంది. పోలీస్ గా ఎర్ర చందనం దొంగలను అంతం చేయడమే టార్గెట్ పెట్టుకున్న లేడీ ఐపిఎస్ గా తను కనిపించబోతోంది. ఇలాంటి పాత్రలో సాయి పల్లవి నటించడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకే చాలామంది ఈ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు. ఓమ్ అంటే తను చేస్తోన్న ఓ పెద్ద పోలీస్ ఆపరేషన్ కు పెట్టుకున్న పేరు. దాన్నే టైటిల్ గా పెట్టారు అంటే సినిమాలో తన పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ధనుష్ హీరోగా నటించిన ఓమ్
ఇక ఈ చిత్రంలో ధనుష్, మమ్మూట్టి, శ్రీలీల కూడా నటించారు. ఈ ఎర్ర చందనం దొంగల్లో ఒకడుగా ధనుష్ కనిపిస్తాడని గతంలోనే విడుదల చేసిన వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఏదేమైనా ‘ఓమ్ స్పెషల్ డ్యూటీ’పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాయి అభయంకర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంతో ధనుష్ మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనిపిస్తోంది.
