Gaaradi Telugu news logo

రివ్యూ : జైలర్ 2
ఆర్టిస్ట్స్ : రజినీకాంత్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, సూర్య, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, విద్యా బాలన్, నమో నారాయణ తదితరులు
ఎడిటర్ : ఆర్. నిర్మల్
సంగీతం : అనిరుధ్
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్
నిర్మాత : కళానిధి మారన్
దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
రిలీజ్ డేట్ : 15.10.2026

రజినీకాంత్ నటించిన జైలర్ 2023లో వచ్చింది. ఆ టైమ్ లో ఇది సూపర్ హిట్ గా నిలిచింది. మూడేళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ అంటే అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి కదా. అలా భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఇవాళ విడుదలైంది జైలర్2. తెలుగులో అసలు ప్రమోషన్స్ లేకపోయినా మంచి ఓపెనింగ్స్ తో వచ్చిందీ మూవీ. మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

జైలర్ కు ఖచ్చితమైన కొనసాగింపుగానే ఈ మూవీ ప్రారంభమైంది. టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) తన కొడుకును కోల్పోయిన బాధలో ఉంటూనే కుటుంబాన్ని నెట్టుకు వస్తుంటాడు. ఫస్ట్ పార్ట్ లో భయంకరమైన విలన్ గా కనిపించిన వర్మ (వినాయకన్) ను చంపింది ఎవరు అంటూ దీరజ్(సూరజ్ వెంజరమూడు) అదే పనిగా వెతికిస్తుంటాడు. అలాగే వర్మలాగా తను కూడా విగ్రహాలను కొనడం అమ్మడం చేస్తూ ఉంటాడు. ఈ ముఠాను నడిపించేది బోధి కల్పక్(సూర్య). టైగర్ ఓ ఆకు రౌడీ మూలంగా అతనికి చిక్కుతాడు. అతని నుంచే ఈ విగ్రహాల ముఠాను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివరికి వర్మను చంపింది టైగరే అని తెలుసుకున్న బోధి కల్పక్.. టైగర్ కుటుంబం మొత్తాన్ని ఎలా ఇబ్బంది పెట్టాడు. తర్వాత ఏమైంది..? ఈ కథలో కాంత(విద్యా బాలన్) పాత్ర ఏంటీ..? జైలర్ కు బ్యాక్ బోన్ గా ఉన్న వాళ్లంతా దాన్ని కొనసాగించారా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

రజినీకాంత్ మూవీ అంటే ఎలా ఉండాలో అలాగే ఉంది జైలర్ 2. ఫస్ట్ పార్ట్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రజినీకాంత్ ఆరా అలాగే కంటిన్యూ కావడం పెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. విగ్రహాల దొంగతనం ముఠా కేవలం వర్మ వరకే ఆగిపోకుండా దాని వెనక ఇంకా పెద్ద ముఠా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అదే టైమ్ లో పవర్ ఫుల్ గా కొనసాగుతుంది. రజినీకాంత్ ఓ చిన్న రౌడీకి కార్ డ్రైవర్ కావడం.. అతన్నే వాడుకుంటే విగ్రహాల ముఠా వరకు వెళ్లడం.. మరోవైపు సూరజ్ వెంజరమూడు.. రజినీకాంత్ చుట్టూ తిరుగుతున్నా అతను వెదికేది అతన్నే అని తెలియకపోవడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మరోస్థాయిలో కనిపిస్తాయి.
ఇంట్లో కొడుకును కోల్పోయిన దుఖంలో ఉన్న రమ్యకృష్ణ, భర్తను కల్పోయిన బాధలో మిర్నా మీనన్.. అసలు అతనికి ఏమైందీ తెలియక బాఢపడటం.. అక్కడి నుంచి వీరిని కాస్త తేలికపరిచే ప్రయత్నంలో వచ్చే సీన్స్ లో రజినీకాంత్ పెద్దరికం చాలా బాగా సెట్ అయింది. ఎప్పుడైతే సూరజ్ తను ఎవరిని వెదుతున్నాడో తెలిసిన తర్వాత వచ్చే సీన్స్, దానికంటే ముందు వచ్చే ఓ హోటెల్ లో వచ్చే సీన్ నెక్ట్స్ లెవెల్ గా ఉన్నాయి. బట్ సూరజ్ పాత్రను ఎండ్ చేస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడి నుంచి సూర్య ఎంట్రీ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు మరింతగా పెరుగుతాయి.


సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ స్థాయిలో లేకపోవడం ఓ పెద్ద మైనస్ గా కనిపిస్తోంది. అక్కడక్కడా హై మూమెంట్స్ ఉన్నాయి తప్ప మిగతా అంతా లో గా ఉంటుంది. ఇంకా చెబితే ఫస్ట్ హాఫ్ లో వాడిన కేమియో రోల్స్ ఈ సారి బిగ్గెస్ట్ మైనస్ గా ఉంది. శివరాజ్ కుమార్ భార్య, కొడుకును సూర్య కిడ్నాప్ చేయడం.. వారిని గోవాలో లాక్ చేయడం.. వారిని విడిపించేందుకు రజినీకాంత్ వెళ్లినా.. వారు అక్కడే ఉన్నా.. అసలు పట్టించుకోకుండా వారిని అలాగే ఉంచడం అస్సలే మాత్రం సెట్ కాలేదు. ఆ కారణంగా సినిమా ల్యాగ్ అయినట్టుగా కనిపిస్తుంది. అయినా కూడా విద్యా బాలన్, మిథున్ చక్రవర్తిల చిన్న పాత్రలైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయి.
ప్రీ క్లైమాక్స్ కే సినిమా అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ దాన్ని కొనసాగిస్తూ మరింత ల్యాగ్ గా ఉండటం బాలేదు. హృతిక్ రోషన్ ను గ్రాండ్ గా పరిచయం చేశారు. కానీ ఆ పాత్రను సడెన్ గా మాయం చేశారు. అలాగే సూర్యను చంపేందుకు అంత టైమ్ తీసుకోవడం కూడా సెట్ కాలేదు. ఏదేమైనా సెకండ్ హాఫ్ లో చాలా లోపాలున్నాయి. అయినా రజినీకాంత్ ఆరా వల్ల ఆ మైనస్ లు కవర్ అవుతుంటాయి. బట్ క్లైమాక్స్ లో జైలర్ గా ఉన్న రజినీకాంత్ తన కొడుకును చంపిన కారణంగా తనే పోలీస్ లకు లొంగిపోయి.. ఖైదీగా మారడం మాత్రం బావుంది.

నటన పరంగా

రజినీకాంత్ కు వయసుకు తగ్గట్టుగా బాగా చేశాడు. రమ్యకృష్ణ, మిర్నా మీనన్ జస్ట్ ఉన్నారంతే. సూరజ్ వెంజరమూడు అద్భుతంగా చేశాడు. సూర్య పాత్ర రొటీన్. విద్యా బాలన్ బాగా చేసింది. మూర్తి పాత్రలో నమో నారాయణ బాగా చేశాడు. యోగిబాబు ఓకే. కేమియో చేసినవాళ్లంతా రజినీ కోసమే వచ్చారు. అయితే క్లైమాక్స్ లో మరో కేమియోలో ఓ విజయ్ సేతుపతి కనిపించింది క్షణాలే. మిగతా పాత్రలన్నీ బాగా చేశారు.

టెక్నికల్

అనిరుధ్ ఎప్పట్లానే అదరగొట్టాడు. కాకపోతే పాటలు అంత రజిస్టర్డ్ గా లేవు. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. ఎడిటింగ్ ఓకే. తెలుగు డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. దర్శకుడుగా నెల్సన్ చాలా వరకు ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ పై మరింత కాన్ సెంట్రేట్ చేసి ఉండి ఉంటే.. ఫస్ట్ పార్ట్ లాగా సూపర్ హిట్ గా నిలిచేది.

ఫైనల్ : జైలర్ ‘ఖైదీ’ అయ్యాడు
రేటింగ్ : 2.75/5
KYR

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి