Gaaradi Telugu news logo

రామ్ చరణ్ పెద్దితో ఇబ్బంది

రామ్ చరణ్ పెద్దితో మంచి అప్లాజ్ వచ్చింది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్ది అనుకున్నంత భారీ వసూళ్లు సాధించలేకపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. బట్ రామ్ చరణ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీ షూటింగ్ లోనే రామ్ చరణ్ చేతికి గాయం అయింది. రిలీజ్ తర్వాత ఆ గాయానికి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకున్నాడు రామ్ చరణ్.

సుకుమార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా డైరెక్టర్

సుకుమార్ పుష్ప, పుష్ప 2 తర్వాత ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. అంతకు ముందే రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం బ్లాక్ బస్టర్ అయింది. అందుకే ఈ కాంబోలో మూవీ మళ్లీ రాబోతోంది అని ప్రకటించిన దగ్గర్నుంచీ ఆడియన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను రీచ్ కావడానికి ఈ ఇద్దరూ సిద్ధం అయ్యారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో మూవీకి అంతా సిద్ధం అవుతోంది. ఇవాళ ఈ కాంబోలో రాబోతోన్న మూవీ ఆఫీస్ కు ఓపెనింగ్ అయింది. పూజలతో స్టార్ట్ చేశారు.

చరణ్, సుక్కూ మూవీ రెడీ అవుతోంది

రామ్ చరణ్, సుకుమార్ ల కాంబోలో ఎలాంటి కథ వస్తే బావుంటుంది అని ఆడియన్స్ లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సుకుమార్ బ్యాక్ టు బ్యాక్ రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ తోనే వచ్చాడు. ఇటు రామ్ చరణ్ కూడా పెద్దితో అలాంటి కంటెంట్ తోనే ఆకట్టుకున్నాడు. అందుకే ఈ సారి ఇద్దరూ కలిసి ఓ స్టైలిష్ యాక్షన్ మూవీతో రాబోతున్నారు అని చెబుతున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలను దాటేలాంటి కంటెంట్ తోనే ఈ కథ ఉండబోతోందని టాక్.

రామ్ చరణ్ కు జోడీగా ఎవరు..?

రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోతోన్న మూవీ ప్రీ ప్రొడక్షన్స్ స్టార్ట్ అయ్యయి. స్టార్ కాస్ట్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే దురంధర్ బ్యూటీ సారా అర్జున్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు అనే రూమర్ అయితే ఉంది. అందులో నిజం ఎంత అనేది తెలియదు. మొత్తంగా రామ్ చరణ్, సుకుమార్ కలయికలో మరో భారీ సినిమా రాబోతోంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి