ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. రవితేజను చూసి నేర్చుకోండి

రవితేజను చూసి నేర్చుకోండి

వీళ్లందరి పేర్లు వాడాము అని కాదు కానీ.. ఇవాళా రేపు కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు అనేది అందరికీ అర్థమైన విషయం. చాలా చిన్న సినిమాలు పెద్ద మ్యాజిక్ లు చేస్తున్నాయి. అదే చాలా పెద్ద సినిమాలు అన్నవి మినిమం కూడా మ్యాజిక్ చేయడం లేదు. అది ఈ మధ్య విడుదలువుతున్న సినిమాలు చూస్తే అర్థమవుతోంది. తెలుగు సినిమాకు ఓ కీర్తి ఉంది. అది సాధించిన గొప్ప ప్రగతి ఉంది. అద్భుతమైన కథలందించిన నేపథ్యం ఉంది. అవన్నీ దాటుకుని ఇప్పుడు మన స్టార్స్ అంతా కేవలం ప్యాన్ ఇండియా మోజులో పడిపోవడం అంత గొప్పగా అనిపించడం లేదు.

చిన్న కథలతో పెద్ద విజయాలు

ఈ మధ్య కాలంలో చూస్తే ఓ మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఓ రకంగా దండయాత్ర చేస్తున్నాయి. ఈ లిస్ట్ లో యడ్ అయిన మూవీ ఇరుముడి. ఇరుముడి మిగతా హిట్ మూవీస్ కంటే చాలా భిన్నమైనది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథనం అద్భుతంగా వర్కవుట్ అయింది. ఆ అద్భుతం వల్లే కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా 80కోట్ల వసూళ్లు సాధించింది.
చాలాకాలం తర్వాత థియేటర్స్ లో ఆడియన్స్ హారతులు పడుతున్నారు. జేజేలు కొడుతున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ కు ఫిదా అయిపోతున్నారు. ఇంత గొప్ప సినిమా ఈ మధ్య కాలంలో చూడలేదు అని చాలామంది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మరి ఈ మూవీలో అంత హైలెట్స్ ఏమున్నాయి అంటే అవేమీ లేవు. ప్యాన్ ఇండియా దరిద్రం అస్సలు లేదు.

ఇరుముడి నేర్పిన పాఠాలు

ఓ చిన్న ఊరు, ఆ ఊరిలోని త్రినాథ్ అనే ఓ ఆటో డ్రైవర్. అతనికి కూతురే ప్రపంచం. బట్ చుట్టూ ఉన్న అనేక సమస్యలు.. ఒక్కోదాన్ని త్రినాథ్ దాటేస్తుంటాడు. కానీ అనుకోని సమస్య ఆ ఊరితో పాటు చుట్టు పక్కల ఊరిలో ఉన్న కొంతమంది లేడీ టీచర్ తో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ ఇబ్బందులు ఏంటీ అనేది తెలియక ఇబ్బంది పడుతుంటాడు త్రినాథ్. ఈ టైమ్ లో అనూహ్యంగా అతి పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని చుట్టూ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ఆడియన్స్ కన్నీళ్లు ఆగడం లేదు. అది ఈ సినిమాలో ఉన్న హైలెట్.
ఇరుముడి అయితే ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనేది అందరికీ తెలిసింది. పెద్ద విషయం ఏంటంటే.. ఈ మూవీలో అనేక లోపాలు ఉన్నాయి. బట్ మెయిన్ కంటెంట్ లో ఉన్న బలం వల్ల ఆ లోపాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే మనమూ వాటి గురించి మాట్లాడనక్కర్లేదేమో.

ప్యాన్ ఇండియా మోజులో మన స్టార్స్

అయితే ఇలాంటి కంటెంట్స్ పై మన స్టార్ హీరోలు కూడా ఫోకస్ పెట్టాలి. బలమైన కథలు, కథనాలు ఉంటే రికార్డ్ లు అవే వస్తాయి. ఇవి మర్చిపోతున్నారు మన హీరోలు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పటి వరకూ సరైన కథను సెలెక్ట్ చేసుకోలేదు. బాహుబలి ఇమేజ్ తో మాగ్జిమం విజయాలు వచ్చాయి అంతే తప్ప అతను ఖచ్చితంగా బలమైన కథలను మాత్రం ఇప్పటి వరకూ ఎంచుకోలేదు అనేది వాస్తవం.
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య, గేమ్ ఛేంజర్ వంటి ఫ్లాపులు చూశాడు. పెద్దిని విజయం అని చెబుతున్నారు కానీ అందులో బోలెడు అంటే బోలెడు మైనస్ లు ఉన్నాయి. ఇది ఓ గ్రామీణ కథ. దీన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో హైలెట్ చేయాలని చూశారు. కానీ అది అవలేదు. ఆ కారణంగా నార్త్ లో వాళ్లు మినిమం దేకలేదు ఈ చిత్రాన్ని.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన దేవర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆపై చేసిన వార్ 2 పోయింది. రాబోయే మూవీ కోసం ఇప్పటికే రెండేళ్ల టైమ్ తీసుకున్నాడు. మరి ఇంకెంత ఆగాలో తెలియదు. బట్ ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్ లో భారీతనం ఉంది తప్ప బలమైన కథ అని ఇప్పటికైతే చెప్పలేం.
ఇందులో కొంత వరకు ఓకే అనిపించుకున్నాడు అల్లు అర్జున్. అతను చిత్తూరులోని ఓ చిన్న ఊరి నుంచి మొదలు పెట్టిన కథ పుష్ప. అనూహ్యంగా ఇది ప్యాన్ ఇండియా కలర్ గా మారింది. ఆ మేరకు ఓకే అనుకోవచ్చు అల్లు అర్జున్. బట్ పుష్ప 2లో ఉన్న లోపాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇక మహేష్ బాబు ఇప్పటి వరకు రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ వైపు చూడలేదు. అయినా విజయాలు వచ్చాయి కాబట్టి ఓకే. రాబోయే వారణాసితో ఎలాంటి విజయం అందుకుంటాడు అనేది చూడాల్సిందే.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాత్రమే కథ. ఎంచుకున్న కథ ఏదైనా అందులో ఓ నావల్టీ ఉండాలి. మెజారిటీ ఆడియన్స్ ను మెప్పు పొందాలి. కథ పాతదే అయితే కథనంతో మాయ చేయాలి. అప్పుడు రూరల్ మాత్రమే కాదు.. రిచెస్ట్ పీపుల్ కథ అయినా కనెక్ట్ అవుతుంది. అందుకు విశ్వనాథ్ అండ్ సన్స్ ను ఉదాహరణగా చూడొచ్చు. ఏదేమైనా మనవాళ్లు ప్యాన్ ఇండియా మోజులో పడిపోయి మనవైన కథలకు దూరం అవుతున్నారు అనేది మాత్రం వాస్తవం.

Continue reading
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన కొణిదల నాగేంద్రబాబు

చిరు కోసం మొక్కలు నాటిన నాగేంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు గారు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబవాసిని) మొక్కను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుండి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు.

ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ

ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ: అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గం.

ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుంది. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా! ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలి.

మెగా ఫ్యామిలీ కోసం మొక్కలు నాటిన నాగబాబు

కుటుంబ సంప్రదాయంలో భాగంగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక తదితర కుటుంబ సభ్యుల పేర్లతో దాదాపు 120కి పైగా మొక్కలు నాటినట్లు నాగబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి, ప్రియమైన వారి ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.

Continue reading
పెద్ది ఓటిటిలోకి వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్దికి ఓటిటి డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ప్యాన్ ఇండియా హీరోగా చెప్పినా కేవలం తెలుగులో మాత్రం మెప్పించగలిగిందీ మూవీ. సౌత్ లోని ఇతర భాషల్లో జనం పట్టించుకోలేదు. అలాగే నార్త్ అస్సలు చూడలేదు. తెలుగులో మాత్రమే హిట్ అని చెప్పగలిగారు. అయితే రామ్ చరణ్ నటన విషయంలో మాత్రం యూనానిమస్ అంతా ఒకటే చెప్పారు. అద్భుతంగా నటించాడు అని. అలాగే జాన్వీ కపూర్ ఎపిసోడ్ విషయంలో బుచ్చిబాబు రైటింగ్ వరస్ట్ గా ఉందనే టాక్ కూడా వచ్చింది. దీంతో పాటు పాత్రలను ఇంకాస్త బలంగా రాసి ఉంటే బావుండేది అని కూడా అన్నారు. కేవలం రామ్ చరణ్ పైనే ఫోకస్ చేయడం.. అందులో మూడు ఆటలతో అంటే జనం విసిగిపోయారు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే చాలాకాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో ఇచ్చిన సంగీతానికి వంద మార్కులు పడ్డాయి. అతని వర్క్ సింప్లీ సూపర్బ్ అని చెప్పారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది.
ఈ నెల 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది పెద్ది. మామూలుగా థియేటర్స్ లో ఆడకపోయిన మూవీస్ కు ఓటిటిలో మంచి అప్లాజ్ వస్తుందనే దశ కూడా దాటేశారు. ఇప్పుడు థియేటర్ రిజల్ట్స్ ఓటిటిలో కూడా రిపీట్ అవుతున్నాయి. ఆ కారణంతో పెద్దికి కేవలం తెలుగులో మాత్రమే పాజిటివ్ టాక్ వస్తుంది లేక ఇతర భాషల్లో కూడా ఆడుతుందా అనేది చూడాల్సిందే.

Continue reading
పుష్ప రూట్ లోనే రామ్ చరణ్.. ఇది సుకుమార్ ప్లానేనా..?

పెద్దితో రామ్ చరణ్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి పెద్ది తర్వాతేంటీ అనే ప్రశ్నకు ఎప్పుడో సమాధానం చెప్పాడు. సుకుమార్ తో మూవీ చేయబోతున్నాడు చరణ్. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీతోనే ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని చాలామంది ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. దాంతో పాటు చరణ్ కు చెవుడు ఉన్నట్టుగా ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు సుకుమార్. 2018లో వచ్చిన రంగస్థలం తర్వాత మళ్లీ ఈ కాంబోలో మూవీ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. దీనికి తోడు ఈ ఇద్దరూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్స్. అంటే రాబోయే కథ కూడా అలాగే ఉంటుంది అని భావించొచ్చు.
ఇక ఈ కథ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇది మళ్లీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఇది పూర్తిగా సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని పక్కా సమాచారం. దీంతో పాటు దీన్ని కేవలం ఒకే పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా రూపొందించబోతున్నారట. రెండు భాగాలు అంటే పుష్ప, పుష్ప 2 లాగా చాలా టైమ్ తీసుకోకుండా.. ధురంధర్ లాగా రెండు భాగాలను వెంట వెంటనే విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఈ మూవీ అయితే సుకుమార్ స్టైల్ కు భిన్నంగా కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందనేది మాత్రం నిజమే అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోబోతున్నాడు. అన్నీ సెట్ అయితే దసరా తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందని టాక్.

Continue reading