నితిన్ హీరోగా అలియాస్ రుక్మిణి మూవీ
నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ ‘అలియాస్ రుక్మిణి’. మురళీకాంత్ దర్శకత్వం చేస్తున్నాడు. టైటిల్ తోనే చాలామందిని ఆకట్టుకున్నారు. టైటిల్ రివీల్ టైమ్ లో విడుదల చేసిన గ్లింప్స్ చాలామందికి నచ్చింది. ఈ సారి ఖచ్చితంగా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు అనిపించాడు. అలియాస్ రుక్మిణిని డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నారు. అయితే ఇన్ని రోజులు అసలు ఈ రుక్మిణి ఎవరు అనే ప్రశ్న చాలామందిలో మిగిలిపోయింది. తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
నితిన్ ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు
నితిన్ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఉండిపోయాడు. ఓ దశలో అతని పని అయిపోయిందనే కమెంట్స్ కూడా వచ్చాయి. అతని స్టోరీ సెలెక్షన్ పైనా చాలామంది కమెంట్స్ చేశారు. ఈ టైమ్ లో దండోరా మూవీతో చాలామందిని ఆకట్టుకున్న మురళీకాంత్ ఈ చిత్ర కథ చెప్పి నితిన్ ను ఒప్పించాడు. నాని ప్రెజెంటర్ గా ఈ చిత్రాన్ని దీప్తి గంటా నిర్మిస్తోంది.
రుక్మిణిగా ఆఫియా సయూద్ ను పరిచయం చేస్తూ వీడియో విడుదల
ఇక అలియాస్ రుక్మిణి ఎవరు అనే విషయాన్ని ఓ మంచి వీడియోతో రివీల్ చేసింది టీమ్. ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఆ బ్యూటీ పేరు ఆఫియా సయూద్. తను బాలీవుడ్ లో ఒకట్రెండు మూవీస్ చేసింది. కానీ అంతగా ఫేమ్ కాలేదు. మరి తనను ఎలా వెదికి తీసుకున్నారో తెలియదు కానీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా చాలా తక్కువమంది ఉన్నారు.
ఆఫియా సయూద్ టాలీవుడ్ లో పాగా వేస్తుందా..?
అఫియా సయూద్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోలో చూస్తే.. తను ఓ క్లాస్ టీచర్.ఆమెపై స్టూడెంట్స్ అందరిలోనూ కోపం ఉంది. ఆమె ఫోటోను ఓ బోర్డ్ లో గీసి.. ‘డెవిల్’, ‘హిట్లర్’ అంటూ ‘హోమ్ వర్క్ పోలీస్’అనే పేర్లు పెట్టారు. దీంతో తను కాస్త కోపం ప్రదర్శిస్తూ.. డెవిల్ అనే చోట తన రుక్మిణి అనే పేరు రాసుకుంది. ఇది బావుంది. చూడగానే సింపుల్ గా, ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ బ్యూటీ టాలీవుడ్ లో పాగా వేస్తుందా లేదా అనేది ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది.
