Gaaradi Telugu news logo

పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీస్ చేశారు. గీత గోవిందం 100 కోట్లు కలెక్ట్ చేసింది. డియర్ కామ్రేడ్ ఆ స్థాయి విజయం సాధించలేదు కానీ తర్వాత ఈ మూవీపై చాలా పాజిటివిటీ కనిపించింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనే రూమర్స్ వస్తుండటం.. వాటిని ఇద్దరూ ఖండించలేదు, అవును అనీ చెప్పలేదు. ఫైనల్ గా ఈ యేడాది ఫిబ్రవరి 26న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఇద్దరూ కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు.

విజయ్ కంటే రష్మిక సక్సెస్ రేట్ ఎక్కువ

విజయ్ దేవరకొండతో పోలిస్తే రష్మిక మందన్నా సక్సెస్ రేషియోలో నెక్ట్స్ లెవల్ లో ఉంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ అదరగొడుతోంది. బిగ్గెస్ట్ హిట్స్ కూడా కొడుతోంది. మరి ఈ టైమ్ లో ఇద్దరూ కలిసి సినిమా చేయడంతో అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. ఇది కేవలం కాంబోపై మాత్రమే కాదు.. మూవీపై కూడా కనిపిస్తోంది. రణబాలి ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఇది ష్యూర్ షాట్ అని ఫిక్స్ అయ్యారు. దీనికి తోడు తనపై వస్తోన్న నెగెటిటీపై విజయ్ స్పందించిన విధానంపై ప్రశంసలు వస్తున్నాయి.

విజయ్, రష్మిక వేర్వేరుగా ఫ్యాన్ మీట్స్

తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరూ కలిసి వేర్వేరుగా ఫ్యాన్ మీట్ పెట్టుకున్నారు. ఇద్దరూ తమ అభిమానులను కలిశారు. ఫోటోస్ దిగారు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఓ రకంగా టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కూడా బాగా పెరుగుతోంది. అభిమానులను సినిమాల రిలీజ్ కు ముందే కలవడం అనేది బావుంది. కాకపోతే ఇద్దరూ వేర్వేరుగా ఫ్యాన్ మీట్ పెట్టడం కంటే కలిసే పెట్టి ఉంటే ఇంకా బావుండేది అనిపిస్తుంది.

పెళ్లి తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారా..

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రణబాలికి రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. రాహుల్ ఇప్పటికే తీసిన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. అది రణబాలిలో కూడా కనిపించబోతోంది అనిపిస్తోంది. ట్రోల్స్, మీమ్స్ ఈ సారి పెద్దగా వర్కవుట్ కావడం లేదు అనేది వాస్తవం. అందుకే విజయ్ ఈ సారి ఖచ్చితంగా ఓ పెద్ద హిట్ కొట్టబోతున్నాడు అనుకుంటున్నారు. ఏదేమైనా పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరూ కలిసి చేసిన సినిమా కాబట్టి ఆడియన్స్ లో ఆ పాజిటివ్ వైబ్స్ కూడా పెద్దగానే కనిపిస్తున్నాయి. మరి ఈ అన్ని పాజిటివ్ వైబ్స్ అన్నీ విజయ్ కి బాగా కలిసి వస్తే సినిమా నిజంగా పెద్ద విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి