నాని ప్యారడైజ్ కు మిక్స్ డ్ రివ్యూస్
నాని హీరోగా నటించిన ద ప్యారడైజ్ పై చాలా విమర్శలు వచ్చాయి. అదే స్థాయిలో ప్రశంసలు కూడా వచ్చాయి. బట్ మూవీ కంటెంట్ పై మాత్రం చాలా వరకు నెగెటివ్ రివ్యూసే వచ్చాయి. ముఖ్యంగా నాని ఇమేజ్ కు భిన్నమైన రక్తపాతం శృతి మించింది అనేది అంతా ఒప్పుకునే మాట. అయితే తర్వాత చేయబోయే బ్లడీ రోమియో మూవీపై కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని. అయినా ఇందులో కూడా అతనో గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు అని మూవీ టీమ్ నుంచి ఇన్ డైరెక్ట్ గా వచ్చిన అప్డేట్. అనౌన్స్ మెంట్ టైమ్ లో నాని ఓ చెఫ్ గా కనిపిస్తాడు అనుకున్నారు. కానీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోన్న ఈ మూవీలో అతను ఓ కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు అంటున్నారు.
ప్రేమ్ కుమార్ తో నాని..?
బ్లడీ రోమియో తర్వాత నాని చేయబోతోన్న మూవీ విషయంలో చాలా వార్తలు వచ్చాయి. చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్ లో తాజాగా మరో పేరు వినిపిస్తోంది. అతను ప్రేమ్ కుమార్. తమిళ్ లో 96, మేయాళవన్(తెలుగులో సత్యం సుందరం) చిత్రాలతో తనదైన ముద్రను బలంగా చూపించాడు ఈ దర్శకుడు. ఆ రెండు సినిమాల్లో అద్భుతమైన ఎమోషన్స్ తో పాటు హ్యూమన్ ఎలివేషన్స్ వల్ల ఆ రెండు చిత్రాలూ చాలా పెద్ద విజయం సాధించాయి.
విక్రమ్ తో మూవీ చేస్తున్న ప్రేమ్ కుమార్
సత్యం సుందరం తెలుగులో బిగ్ హిట్ గా నిలిచింది. కార్తీ, అరవింద్ స్వామి కాంబోలో వచ్చిన ఈ మూవీ అత్యంత తక్కువ లొకేషన్స్ లో సాగే సినిమా. ఇంకా చెబితే మేజర్ పార్ట్ అంతా ఒకే రోజు కనిపించే కథలా ఉంటుంది. ఇలాంటి చిత్రాలు తీసిన దర్శకుడుతో నాని మూవీ అంటే అభిమానుల ఆనందానికి అంతు లేదు అనే చెప్పాలి.
ప్రేమ్ కుమార్ మేయాళవన్ తర్వాత విక్రమ్ తో ఓ యాక్షన్ ఓరియంటెడ్ కథతో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది అతని గత రెండు చిత్రాలకు పూర్తి భిన్నమైన కంటెంట్ తో వస్తోందని టాక్. విక్రమ్ తో మూవీ తర్వాత 96 కు సీక్వెల్ చేయాలని చూస్తున్నాడు.
నాని, ప్రేమ్ కుమార్ తో ప్రస్తుతం రూమర్
ఈ టైమ్ లో నానితో మూవీ అనే న్యూస్ ఎలా వస్తుంది అనేది తెలియడం లేదు. ఓ రకంగా విక్రమ్ కుమార్.. నానితో మూవీ చేయాలనుకుంటే అది ఖచ్చితంగా అతని స్టైల్లో సాగే ఎమోషనల్ కంటెంట్ తో ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి నాని, విక్రమ్ కుమార్ మూవీ ప్రస్తుతం అయితే జస్ట్ గాసిప్ మాత్రమే. నిజం అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
