అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం..
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ క్రేజీ కళ్యాణం. తరుణ్ భాస్కర్, అఖిల్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. రాజు వెడ్స్ రాంబాయిలో హీరోగా నటించిన అఖిల్ కు ఇది ఓ కీలకమైన మూవీ అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. పాటలు కూడా బావున్నాయి. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి అందించాడు. క్రేజీ కళ్యాణం ఈ నెల 16న విడుదల కాబోతోంది. బట్ ప్రమోషన్స్ పరంగా మినిమం వార్తలు కూడా రావడం లేదు. అందుకు కారణాలేంటీ అనేది క్లారిటీ లేదు.
రిలీజ్ కు వారమే టైమ్ ఉంది
అనుపమ పరమేశ్వరన్ మూవీ అంటే ఉండాల్సినంత హడావిడీ మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఈ చిత్రానికి దర్శకుడు బద్రప్ప గాజుల. అతనికి సంబంధించి ఎలాంటి వార్తలు కూడా కనిపిండం లేదు. అలాగే ఈ చిత్ర నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి. అతనూ అడ్రెస్ లేడు. ఒక వారం రోజుల్లోనే మూవీ విడుదల కాబోతోంది. ఈ టైమ్ లో అసలు ఎలాంటి అప్డేట్స్ కూడా కనిపించకపోవడం మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది. ఒకవేళ ఏదైనా ఫైనాన్సియల్ ఇష్యూస్ ఉంటే అది దసరా టైమ్ లో విడుదలకు సిద్ధం కావడం సాధ్యం కాదు.
రణబాలితో ఢీ కొట్టే సినిమాకు ఈ పరిస్థితా..?
క్రేజీ కళ్యాణం ఏకంగా విజయ్ దేవరకొండ రణబాలితో ఢీ కొట్టబోతోంది. అంటే క్రేజీ కళ్యాణం ప్రమోషనల్ గా ఎక్కువ హడావిడీ చేయాలి. ఆడియన్స్ లో అటెన్షన్ సంపాదించాలంటే పెద్ద కష్టపడాలి. అవన్నీ ఏం కనిపించడం లేదు అంటే మూవీ రిజల్ట్ ముందే తెలిసిపోయిందా లేక ప్రమోషన్స్ కు డబ్బులు లేవా అనేది కూడా తెలియాల్సి ఉంది.
అనుపమ పరమేశ్వరన్ అసలే మూవీస్ లేవు
అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య సౌత్ లో బాగా డల్ అయింది. మూవీస్ కూడా స్లోగానే చేస్తోంది. రీసెంట్ గా తన బ్రేకప్ విషయాలు చెప్పి జనాల్లోకి బాగా వెళ్లింది. మరి ఈ టైమ్ లో అసలు మూవీసే లేవు అంటే ఉన్న మూవీకి కూడా ఊసులే లేవు అంటే ఇంక చెప్పాల్సిదేంటీ. మూవీపైన తరుణ్ భాస్కర్ కు కూడా ఇంట్రెస్ట్ లేనట్టుంది. అటు అఖిల్ కూడా పట్టనట్టుగానే ఉన్నాడు. మరి క్రేజీ కళ్యాణం విషయంలో ఇంత లేజీగా ఉన్నారంటే.. మూవీ పోయిందని ముందే అర్థమైపోయిందనుకోవచ్చా..?
