Gaaradi Telugu news logo

నాని అంటే పక్కింటి కుర్రాడు

నాని అంటే పక్కింటి కుర్రాడి లాంటి పాత్రలతో ఆకట్టుకున్న నటుడు. చాలా తక్కువ టైమ్ లోనే నేచురల్ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకున్నాడు. నేచురల్ గా నటిస్తాడా లేదా అనేది పక్కన పెడితే అతని నటనలో కేవలం మూడు ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆ మూడు ఎక్స్ ప్రెషన్స్ తోనే ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. మరి అంతకు మించి ఇంకా బాగా చేయలేడా అంటే చేయలేడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. డైలాగ్స్ చెప్పే విధానంలో కూడా ఒకట్రెండు తరహాలోనే సినిమాల్లోనే కనిపిస్తాడు తప్ప ఒరిజినల్ గా ఆ పాత్రకు తగ్గ డైలాగ్ డెలివరీ ఉండదు అనేది కూడా చెప్పొచ్చు.

నేచురల్ స్టార్ ట్యాగ్ తనే తగిలించుకున్నాడా

నానిని నేచురల్ స్టార్ అని వేరే ఎవరూ చెప్పలేదు.. ఇంకెవరూ పెట్టలేదు. ఒక రకంగా ఆ ట్యాగ్ తనే తగిలించుకున్నాడు. ఇంకా చెబితే ఎవరికీ తెలియకుండా ఓ రేంజ్ లో పి.ఆర్ స్టంట్స్ చేసే హీరోలు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం నానినే మాత్రమే. ఈ విషయం ఇప్పటికిప్పుడు చెప్పుకునేది కాదు.. ఓ దశలో మెగాస్టార్ అనడానికంటే ముందు చిరంజీవి కూడా ఈ తరహాలో పి.ఆర్ స్టంట్స్ లో లేవ బడ్డవాడే. తను స్వయంకృషితో మాత్రమే ఎదిగానని అదే పనిగా డప్పులు కొట్టించుకున్నాడు అనేది కాదనలేని వాస్తవం. అంతకు ముందే అత్యంత సాధారణ స్థాయిలో వచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు, శోభన్ బాబు, కృష్ణ వంటి వారు కూడా ఇలాగే వచ్చిన వారే కదా. స్వయంకృషితో ఎదిగిన వారే కదా. కానీ ఆ ట్యాగ్ తనకు మాత్రమే వచ్చినట్టుగా ఓ రేంజ్ లో పి.ఆర్ స్టంట్స్ చేయించుకున్నాడే చిరంజీవి.

చిరంజీవి రూట్ లోనే నాని

నాని కూడా చిరంజీవి రూట్ లోనే వచ్చాడు. ఆ విషయంలో కామన్ ఆడియన్సెస్ కు పెద్దగా తెలియదు. ఇంకా చెబితే అర్థం కాలేదు కూడా. కొన్నాళ్లుగా ఇలాంటి స్టంట్స్ నే తెగ ఫాలో చేస్తున్నాడు నాని. అదే పనిగా తను చిరంజీవిలాగానే స్వయంకృషితో ఎదిగిన వాడినే అనేది ఇన్ డైరెక్ట్ గా ఊదుతున్న బాకా. విశేషం ఏంటంటే.. ఇలాంటి స్టంట్స్ అలాగే నిజంగా ఎదిగిన రవితేజ ఎప్పుడూ చేయలేదు. అలాగే ఎదిగిన నిఖిల్ సిద్ధార్ధ్, రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా చేయలేదు. బట్ నాని ఇలా పి.ఆర్ స్టంట్స్ చేయించుకోవడంలో ఆరితేరినవాడు అనేది చాలామందికి తెలియని విషయం.

మాస్ ఇమేజ్ పై నాని ఆరాటం

నాని కొన్నాళ్లుగా అదే పనిగా మాస్ హీరో అయిపోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. బట్ ఆరాటమే కాదు.. పోరాటం కూడా తెలియాలి కదా. ఈ విషయంలో నానికి పోరాటం తెలియడం లేదు అనేది వాస్తవం. ఎంచుకున్న కథల్లో కొన్నిసార్లు విషయం ఉంది. కానీ ఆ విషయాన్ని ఎలివేట్ చేసే సామర్థ్యం నానిలో లేదు అని అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్, దసరా, హిట్ 3 చిత్రాల్లో అతని నటనపై ప్రశంసలైతే రాలేదు. జస్ట్ అతను కొత్తగా ప్రయత్నించాడు కానీ కష్టమే అని ఫీలయ్యారు చాలామంది. ఆ విషయం నానికి ఇంకా అర్థం కాలేదు అనేది వాస్తవం.

ద ప్యారడైజ్ రిజల్ట్ తో తేలిపోయిన నాని రేంజ్

తాజాగా వచ్చిన ద ప్యారడైజ్ చూస్తే అసలు ఈ కంటెంట్ లోనే బలం లేదు. కథలో దమ్ముంది.. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో అనేక లోపాలున్నాయి. దర్శకుడికి ఈ కథపై కమాండ్ లేదు.. కేవలం మాస్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేశాడు అనేది కూడా తెలుస్తోంది. అది ఫస్ట్ షోకే ఆడియన్స్ డిక్లేర్ చేశారు. అప్పటికే మూవీకి మంచి బజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయింది. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజే 60 కోట్లు( వాళ్లు 88 కోట్లు అని చెప్పారు కానీ అది నిజం కాదు) వరకు వచ్చాయి. కట్ చేస్తే రెండో రోజుకే ఇందులో మూడొంతల వసూళ్లు తగ్గిపోయాయి. అప్పటి నుంచి నానా తంటాలు పడుతున్నాడు. ఈ మూవీని లేపాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
నాని ద ప్యారడైజ్ మూవీలో హీరో తల్లి పాత్ర సమ్మక్క అని పెట్టారని ఏకంగా సమ్మక్క సారక్క గద్దె దగ్గరకు వెళ్లి ప్రమోషనల్ టూర్స్ మొదలు పెట్టాడు. కొన్నాళ్లుగా నాని ఈ ప్రయత్నాలు చేయలేదు. ఆంధ్రాలో కూడా ప్రమోషనల్ టూర్స్ అంటూ హడావిడీ చేశాడు. బట్ అక్కడెవరూ దేకలేదు. ఎవరూ పట్టించుకోలేదు.

నానిపై ఇంత నెగెటివిటీకి కారణం ఇదేనా

విశేషం ఏంటంటే.. ఇన్నేళ్లలో నాని గురించి నెగెటివ్ (వాస్తవ) వార్తలు రాలేదు. బట్ ఫస్ట్ టైమ్ ద ప్యారడైజ్ విషయంలో అనేక విషయాలు వస్తున్నాయి. అతను పి.ఆర్ స్టంట్స్ చేయడంలో మొనగాడని, అతనికి టాలెంట్ లేదనీ, అతన్ని నేచురల్ స్టార్ గా మార్చడానికి పి.ఆర్ లు చేసిన రచ్చే ఇదనీ, ఇంకా చెబితే నానిలో ఇక బలమైన ఇన్ సెక్యూర్ ఉంటుందని.. చెబుతున్నారీ మధ్య. ఓ రకంగా నాని ఇన్నాళ్లుగా కాపాడుకుంటోన్న ఈ ఫీలింగ్స్ అని ఇలా బయటపడుతున్నాయని కూడా అంటున్నారు. ఏదేమైనా మన కేపబిలిటీస్, కెపాసిటీస్ ఏంటీ అని తెలుసుకుని ఆ రకంగా ప్రయత్నం చేయాలి. అలా కాదు నేల విడిచి సాము చేయాలి అని ఫీలైతే మొత్తానికే మోసం వస్తుంది అనేందుకు నాని ద ప్యారడైజ్ మూవీ తర్వాత అతని గురించి వస్తోన్న వార్తలు చూస్తే అర్థం అవుతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి