ప్లాన్ మార్చిన నాగ్ అశ్విన్
నాగ్ అశ్విన్.. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్న దర్శకుడు. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కూడా మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు తీసింది మూడు సినిమాలే. అయితేనేం తనకంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రతి కథలోనూ ఓ ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే అతనంటే చాలామందికి ఇష్టం ఏర్పడటానికి కారణం.
కల్కి పై కామెంట్స్ సీరియస్
నాగ్ అశ్విన్ కల్కితో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ కూడా అతను చెప్పిన కథకు కమిట్ అయ్యారంటే అంతకు మించిన పెద్ద విషయమేం ఉంటుంది. కల్కి విషయంలో కొన్ని కాంట్రవర్శీలు వచ్చినా కూడా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ఆ కాంట్రవర్శీలన్నిటికీ సెకండ్ పార్ట్ లో సమాధానం చెబుతా అన్నాడు. బట్ ఈ సెకండ్ పార్ట్ విషయంలోనే భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కల్కి 2 కంటే వెబ్ సిరీస్
నాగ్ అశ్విన్ కల్కి 2 కంటే ముందు ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడని టాక్. నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేస్తుందట. ఇది ఓ భారీ ప్రాజెక్ట్ గానే ఉండబోతోంది అంటున్నారు. అయితే నాగ్ అశ్విన్ స్టైల్లోనే ఇది ఓ కొత్త కథతో రాబోతోంది. ఎఫ్ 1 రేస్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. ఎఫ్ 1 రేస్ లంటే నాగ్ అశ్విన్ కు చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టమట. ఆ కారణంగానే ఆ నేపథ్యంలోనే ఈ కథ రాసుకున్నాడట.
ఎఫ్ 1 రేస్ నేపథ్యంలో వెబ్ సిరీస్
నాగ్ అశ్విన్ రాసుకున్న వెబ్ సిరీస్ సినిమాగా అయితే బావుండదట. సిరీస్ గా అయితేనే దీని స్కేల్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని ఫీలయ్యాడట. అందుకే వెబ్ సిరీస్ నే తీయబోతున్నాడు. ఈ కారణంగానే కల్కి 2 విషయంలో పెద్దగా ఫోకస్ చేయడం లేదనే టాక్ కూడా ఉంది. కల్కి 2 కంటే తన ఫేవరెట్ ఎఫ్ 1 నేపథ్యంలో రాబోతున్న సిరీస్ కే తన ఓటు పెద్దగా వేయబోతున్నాడు అంటున్నారు. మరి కల్కి 2 తర్వాతా లేక కల్కి 2 కంటే ఈ వెబ్ సిరీస్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
