
అజిత్ కుమార్ డేర్ డెవిల్
తమిళ్ స్టార్ అజిత్ కుమార్ కొంత కాలం క్రితం వరకూ ఓ బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. బట్ 2025లో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ మూవీ తెలుగు వారికి పెద్దగా కనెక్ట్ కాలేదు కానీ తమిళ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తర్వాత కార్ రేస్ లు అంటూ కొంత కాలం గడిపాడు. 2026 సెకండ్ హాఫ్ లో మళ్లీ బిజీ అయిపోయాడు. ఇందులో భాగంగా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో మరోసారి జత కట్టాడు.
అజిత్ కుమార్ ఈ సారి ‘డేర్ డెవిల్’ అనే టైటిల్ తో రాబోతున్నాడు. ఈ చిత్రానికే అధిక్ రవిచంద్రన్ దర్శకుడు.
శ్రీలీలకు బంపర్ ఆఫర్
ఇందులో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ టైమ్ లో ఆమెకు వరుసగా డిజాస్టర్స్ పడుతుండటంతో దర్శకుడు వేరే ఛాయిస్ తీసుకోవాలనుకున్నాడు. దీంతో చాలామంది శ్రీలీలకు ఈ మూవీ ఆఫర్ కూడా పోయింది అని చెప్పారు. బట్ ఫైనల్ గా శ్రీలీలనే ఈ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు మేకర్స్.
శివరాజ్ కుమార్ తో పాటు టోవినో థామస్ కూడా
ఇక ఈ చిత్రంలో అజిత్ కుమార్ తో పాటు కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. శివరాజ్ కుమార్ ఆల్రెడీ జైలర్ లో చేసిన చిన్న పాత్ర మోత మోగించింది. జైలర్ 2లో ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. బట్ తను మాత్రం కొంతకాలంగా ఇతర భాషా చిత్రాల్లో బాగా కనిపిస్తున్నాడు. తెలుగులో పెద్దిలో బాగా చేశారు. ఇప్పుడు తమిళ్ లో అజిత్ కుమార్ మూవీలో అంటే మంచి పాత్రనే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
శివరాజ్ కుమార్ తో పాటు మళయాల స్టార్ టోవినో థామస్ కూడా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటించబోతున్నాడు. అలాగే ప్రభు, పార్తీబన్, సునిల్ కూడా నటించబోతున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా ఈ మొత్తం క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రీలీలకు మంచి ఆఫర్ అనే చెప్పాలి. మరి ఈ మూవీతో హిట్ కొడితే తనకు మరిన్ని ఆఫర్స్ వస్తాయని వేరే చెప్పక్కర్లేదేమో.
