Gaaradi Telugu news logo

రవితేజ ఇరుముడితో ఇండస్ట్రీ హిట్

మాస్ మహరాజ్ రవితేజ ఇరుముడితో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇరుముడి ఊహించనంత భారీ హిట్ అని చెప్పాలి. ఇరుముడి రిలీజ్ తర్వాత మరో మూవీ అనౌన్స్ అయింది. దిల్ రాజు నిర్మాతగా హసిత్ గోలి దర్శకత్వంలో మూవీ రాబోతోందని అఫీషియల్ గానే ప్రకటించారు. బట్ ఇరుముడి మరీ ఇంత పెద్ద హిట్ కాదు అని భావించారంతా. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో రవితేజ సడెన్ గా రెమ్యూనరేషన్ పెంచాడు. మామూలుగా అతనికి 15 -18 కోట్ల రెమ్యూనరేషన్ ఉంటుంది. అయితే ఇరుముడికి నైజాం రైట్స్ కూడా తీసుకున్నాడు. ఇది ఊహించని విజయం కాబట్టి ఆ మేరకు రవితేజకే వచ్చాయి. అంటే అతనికి రెమ్యూనరేషన్ తో పాటు నైజాం రైట్స్ తో కలిపి 45 కోట్ల వరకు వచ్చాయి.

రవితేజ రెమ్యూనరేషన్ ఇష్యూ

రవితేజ ఇంత పెద్ద రెమ్యూనరేషన్ ఎక్స్ పెక్ట్ చేసి ఉండడు. అందుకే తన తర్వాతి మూవీ అంటే దిల్ రాజుతో చేయాల్సిన సినిమాకు కూడా ఇలాగే రెమ్యూనరేషన్ తో పాటు ఓ ఏరియా రైట్స్ కావాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్ కు తలొగ్గని దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను వదులుకున్నాడు. దీంతో ఆ ప్లేస్ లో ఏ నిర్మాత, దర్శకుడు వస్తాడా అని చాలామంది భావించారు.

రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ

వివేక్ ఆత్రేయ, రవితేజ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. మామూలుగా దీనిపై గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. బట్ అప్పటికే వివేక్ ఆత్రేయ, బాలకృష్ణతో మూవీకి కమిట్ అయ్యాడు అని కూడా చెప్పారు. బట్ ఆ ప్లేస్ లో బాలయ్య, కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తనకు టైమ్ ఉంది కాబట్టి వివేక్ ఆత్రేయ ఇప్పుడు రవితేజతో మూవీకి కమిట్ అయ్యాడు. లక్ష్మణ్, శ్రీని రావు అనే ఇద్దరూ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతోన్న మూవీ టైటిల్ డాక్యుమెంటరీ విడుదల చేయబోతున్నారట. ఈ డాక్యుమెంటరీని ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు ప్రకటించబోతున్నాం అని చెప్పారు. ఏదేమైనా రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబో కూడా బానే ఉంటుందనుకోవచ్చు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి