మాస్ మహరాజ్ రవితేజ ఇరుముడితో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీనికంటే ముందు అతను ఏకంగా ఐదు సినిమాల వరకూ డిజాస్టర్స్ చూశాడు. ఈ టైమ్ లో రవితేజ పని ఐపోపయిందని చాలామంది కామెంట్స్ చేశారు. అయినా అతను పట్టు వదలకుండా చేసిన ప్రయత్నంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఈ మూవీ ఏకంగా 250 కోట్ల వరకు రాబడుతుందని చెబుతున్నారు.
ఇరుముడి రైట్స్ రవితేజకు భారీ పారితోషికం
విశేషం ఏంటంటే.. ఇరుముడికి అతను రెమ్యూనరేషన్ తీసుకోలేదు. కానీ లాభాల్లో వాటాగా నైజాం ఏరియాను తీసుకున్నాడు. కట్ చేస్తే అదే ఏరియా నుంచి అతనికి ఏకంగా 40 కోట్లకు పైగా వచ్చింది. మామూలుగా అయితే రవితేజ రెమ్యూనరేషన్ 18 -20 కోట్లు మాత్రమే. ఇరుముడి రైట్స్ రూపంలో అంత భారీ మొత్తం రావడంతో ఇప్పుడు నిర్మాతలకు గట్టి షాక్ ఇవ్వబోతున్నాడు రవితేజ. బట్ అందుకు కౌంటర్ గా దిల్ రాజు నిర్ణయం అతనికి షాక్ ఇచ్చింది.
రెమ్యూనరేషన్ భారీగా పెంచిన రవితేజ
రవితేజ ఇరుముడితో బిగ్గెస్ట్ హిట్ కొట్టగానే రెమ్యూనరేషన్ భారీగా పెంచాడు. ఏకంగా 20 కోట్లతో పాటు నైజాం ఏరియా రైట్స్ కావాలని డిమాండ్ చేస్తున్నాడట. అయితే ఆల్రెడీ దిల్ రాజు రవితేజతో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ మేరకు రవితేజ కూడా ఓకే చెప్పాడు. హసిత్ గోలి దర్శకత్వంలో మూవీ రాబోతోందని ముగ్గురూ కలిసి ఫోటోలు దిగి మరీ ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ లో ఉంది. ఇరుముడి హిట్ కావడంతో రవితేజలో రెమ్యూనరేషన్ భారీగా పెంచాడు.
ప్రాజెక్ట్ నే వదులుకున్న దిల్ రాజు
రవితేజ పారితోషికం పెంచడంతో దిల్ రాజు ఇబ్బంది అనిపించింది. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాక నైజాం రైట్స్ కూడా అడుగుతున్నాడు అని ఏకంగా అసలా ప్రాజెక్ట్ నే పక్కన పెట్టాడు. అంటే ఈ మూవీ క్యాన్సిల్ అయిందన్నమాట. మొత్తంగా స్వాగ్ మూవీతో బాగా ఆకట్టుకున్న దర్శకుడు హసిత్ గోలికి కూడా ఇదో షాకింగ్ విషయం అనే చెప్పాలి.
శివ నిర్వాణ వల్లే రవితేజకు హిట్
దిల్ రాజు కాలిక్యులేషన్స్ ఉన్న నిర్మాత. అందుకే అతను ఈ మొత్తం వర్కవుట్ కాదు అని భావించే ఈ ప్రాజెక్ట్ ను ఆపుకున్నాడు. అది కాక రవితేజపై నమ్మకం కూడా పూర్తిగా లేదు. ఏదో ఇరుముడి శివ నిర్వాణ వల్ల హిట్ అయింది కాబట్టి మామూలుగా రవితేజ ఎంచుకునే కథల్లో పస లేదు అని భావించే దిల్ రాజు వెనక్కి తగ్గాడన్నమాట. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో రవితేజ వెనక్కి తగ్గుతాడా లేక ఈ ప్రాజెక్ట్ ను అతనూ వదిలేసుకుంటాడా అనేది చూడాల్సిందే.
