Gaaradi Telugu news logo

బాలయ్య గాయం నుంచి తేరుకున్నాడు

నందమూరి బాలకృష్ణ.. దాదా మూవీ షూటింగ్ లో గాయపడ్డాడు. కాకినాడ పోర్ట్ లో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ చేస్తుండగా ఆయన కాలు జారింది. ఇమ్మిడియెట్ గా హాస్పిటల్ కు తీసుకువెళ్లింది టీమ్. కాలికి సర్జీరీ అవసరం అని చెప్పారు డాక్టర్స్. ఈ మొత్తం గత జూలై జరిగింది. ఆ సర్జరీ తర్వాత రెండు నెలల పాటు విశ్రాంతి అవసరం అని చెప్పారు డాక్టర్లు. అప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటున్న బాలయ్య మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘దాదా’

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ దాదాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ కాంబోలో గతంలో వచ్చిన వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ కావడంతో దాదాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ 1990స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఈ మూవీలో బాలయ్య ముంబై గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలయ్య బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన గ్లింప్స్ తో పాటు టైటిల్ అనౌన్స్ మెంట్ టైమ్ లో విడుదల చేసిన వీడియోస్ చూస్తే బాలయ్య మరింత పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది.

మైసూర్ లో టాకీ పార్ట్ షూటింగ్

ఇక దాదా మూవీ షూటింగ్ రీ స్టార్ట్ చేశాడు బాలయ్య. ప్రస్తుతం మైసూర్ లో ఈ మూవీ చిత్రీకరణ సాగుతుంది. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. బాలయ్య సర్జరీ నుంచి ఇప్పుడే రికవర్ అయ్యాడు కాబట్టి మరీ యాక్షన్ సీక్వెన్స్ లు కాకుండా టాకీ పార్ట్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది కాబట్టి మిగతా పార్ట్ మొత్తం చాలా వేగంగా షూటింగ్ చేస్తున్నారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసెంబర్ 24న విడుదల చేయడం ఖాయం అని చెబుతున్నారు. మొత్తంగా ఈ విషయం తెలిసిన బాలకృష్ణ అభిమానులంతా హ్యాపీగా ఫీలవుతున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి