Gaaradi Telugu news logo

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హను రాఘవపూడి డైరెక్షన్ చేస్తోన్న ఫౌజీ. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ తో పాటు కల్కి 2 కూడా ఉంది. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ మూవీస్ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి 2 మాత్రం ఈ నెల చివరలో సెట్స్ లోకి వెళుతుంది. బట్ ఈ షూట్ లో ప్రభాస్ ఉండడట. ప్రభాస్ లేని సీన్స్ ను చిత్రీకరించే ప్లాన్ లో ఉన్నాడు నాగ్ అశ్విన్.
ప్రభాస్ ఓ రకంగా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ స్ట్రాంగ్ నెస్ తన మూవీస్ రిలీజ్ విషయంలో చూపించడం లేదు. ముఖ్యంగా ఫౌజీ చిత్రాన్ని ఈ డిసెంబర్ 4న విడుదల చేస్తారు అని అనౌన్స్ చేశారు. మరి ఏమైందో.. ఇది పోస్ట్ పోన్ అయినట్టే. అలాగని వాయిదా వేశాం అని అఫీషియల్ గా చెప్పలేదు. బట్ అదే టైమ్ కి నాగశౌర్యతో పాటు మరికొన్ని మూవీస్ కూడా వస్తున్నాయని వాళ్లు రిలీజ్ డేట్స్ పోస్టర్స్ వేశారు. అంటే ఫౌజీ వాయిదా పడినట్టే కదా.
ప్రభాస్ స్పిరిట్ మూవీని మార్చి 5న విడుదల చేయబోతున్నారు. ఇందులో మార్పేం లేదు అని చెబుతున్నారు. కానీ చివరి నిమిషంలో ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ఫౌజీపై అంతగా లేవు. అందుకే ఫౌజీని ముందు స్పిరిట్ తర్వాత విడుదల చేస్తే బావుంటుంది అనుకుంటున్నారు. లేదంటే ఫౌజీ కంటెంట్ పై చాలా అపనమ్మకాలున్నాయి అనే టాక్ కూడా ఉంది. అలా స్పిరిట్ కంటే ముందు వచ్చే ఫౌజీ ఫ్లాప్ అయితే ఆ ప్రభావం స్పిరిట్ పై పడుతుంది. అలా కాదు స్పిరిట్ హిట్ అయితే అది ఫౌజీకి ప్లస్ అవుతుంది.
ఏదేమైనా ఈ రెండు సినిమాలు పూర్తి చేయడం వరకే తన వంతు అన్నట్టుగా ప్రభాస్ భావిస్తున్నాడు అనుకుంటున్నారు. రిలీజ్ డేట్స్ విషయంలో ఆయా నిర్మాతలు తంటాలు పడటం తప్ప తన చేతిలో ఏం లేదు అనేది ప్రభాస్ ఫీలింగ్ ట. మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ విషయంలో కొట్టుకుంటాయా లేక కలిసి మాట్లాడుకుని ఫౌజీనే వాయిదా వేయాలనుకుంటాయా అనేది చూడాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి