
అన్నా లెజినోవా బానే ఉంది కదా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు తీసుకున్నాడు. ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. పోనీ వీరి మధ్య మాటల యుద్ధం ఉందా.. లేదంటే మనస్ఫర్థలున్నాయా.. ఇంకా చెబితే కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారా అనేది కూడా తెలియదు. కాకపోతే కొన్ని నెలల కిందే పవన్ కళ్యాణ్ తన ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్లాడు. ఆ టైమ్ లో అన్నా లెజినోవా చాలా జాగ్రత్తగా చూసుకుంది.. అని చెబుతారు. ఆపై మెగా ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది అన్నా లెజినోవా. కొన్ని రోజుల క్రితమే తన పేరు నుంచి లెజినోవా తొలగించుని ఏకంగా అన్నా కొణెదల అని మార్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టి మరీ తెలిపింది.
విడాకుల ముందే కొత్త ఎఫైర్స్
ఎలా చూసినా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాది అన్యోన్య దాంపత్యం అని చాలామంది భావించారు. బట్ సడెన్ గా వీరు విడాకులు తీసుకోవడం మాత్రం ఎవరికీ జీర్ణం కాని విషయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలకంగా ఉన్నాడు. ఈ టైమ్ లో అనేక విమర్శలు వస్తాయి అని తెలుసు. అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వెనక కారణాలేంటీ అని చాలామంది ఆరాలు తీస్తున్నారు. ఈ ఆరాల్లో పేరాల కొద్దీ వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ భార్యకు విడాకులు ఇవ్వకుండానే రేణూదేశాయ్ తో సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడు కూడా పొలిటికల్ ఇష్యూస్ వల్లే ఫస్ట్ భార్యకు అఫీషియల్ గా విడాకులు ఇచ్చి తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆపై రెండో భార్య రేణూ దేశాయ్ తో విడాకులు తీసుకోకుండానే మరో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే రేణూదేశాయ్, విపన్ కళ్యాణ్ మధ్య అదే పనిగా గొడవలు వచ్చాయి. ఓ దశ వరకూ గొడవలు పడిన తర్వాత రేణూ దేశాయ్ అతనితో విడిపోవాలని నిర్ణయించుకుంది.. విడాకులు తీసుకుంది. ఈ విడాకులు అవగానే మూడో పెళ్లికి సిద్ధం అయ్యాడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా మూడో జంట ముచ్చటగా ఉందని చాలామంది అనుకున్నారు. ఆ కారణంగానే వీరు ఏకంగా 13యేళ్ల పాటు దాంపత్యం చేశారు. ఇద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. అంతా బానే ఉంది అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా ఈ విడాకులు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం అంటే.. ఇప్పటి వరకూ చెప్పుకున్నదే అవుతుందా అనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లికీ సిద్ధమేనా..?
అంటే పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటున్నాడు అంటే ఆల్రెడీ అతనికి మరో ఎఫైర్ ఉందనే అర్థం కనిపిస్తోంది. సో.. పవన్ కళ్యాణ్ కు ఆల్రెడీ మరో ఎఫైర్ ఉంది కాబట్టి భార్య అన్నా లెజినోవా విడిపోవాలనుకుంది. అందుకే తను విడాకులు తీసుకుంది. ఇది కూడా సామరస్యంగా ఉండాలనే తీసుకున్న నిర్ణయం అని వినిపిస్తోంది. అఫ్ కోర్స్ విడాకులకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ లో ఈ సామరస్యం కనిపిస్తోంది. కానీ దీనికంటే ముందే ఇద్దరి మధ్య చాలా గొడవలు ఉండి ఉండొచ్చు అనుకోవచ్చు. లేదంటే సడెన్ గా ఈ డివోర్స్ డెసిషన్ ఎందుకు వస్తుంది అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధపడే విడాకులు తీసుకున్నాడు అనే వార్తలో అయితే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇది కేవలం అతని వ్యక్తిగత విషయం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఓ సచివాలయ ఉద్యోగితో వ్యవహారం సాగిస్తున్నాడు అనే న్యూస్ వినిపిస్తోంది. బట్ ఇందులో కూడా ఇప్పటికైతే నిజం లేదు. జస్ట్ రూమర్. మరి పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడా లేక సనాతని ధర్మన్ కాబట్టి ఇక ఇలాగే ఉండిపోతాడా అనేది తేలాల్సిన విషయం.
