
ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్
ఎన్టీఆర్ ఏదైనా మూవీకి సపోర్ట్ చేస్తే వందశాతం చేస్తాడు. ఓ వైపు తను డ్రాగన్ మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అయినా ఇట్లు అర్జున మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడు.. రిలీజ్ చేశాడు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే.. టీజర్ మాత్రం చాలా బావుంది. బట్ ట్రైలర్ మాత్రం ఆ స్థాయిలో లేదు అనే చెప్పాలి. అనీష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. నిజానికి ఇది అక్టోబర్ 30నే విడుదల కావాల్సిన సినిమా. ఆ రోజు ఆదర్శ కుటుంబం వస్తోందని వాయిదా వేశారు. ఈ పోస్ట్ పోన్ వల్ల ఎన్టీఆర్ ట్రైలర్ చేయడం మంచిదే అయింది.
ఇట్లు అర్జున ట్రైలర్ రివ్యూ
ఇట్లు అర్జున ట్రైలర్ డల్ గా ఉంది. ఇందులో అనీష్ ఓ మూగవాడి పాత్రలో నటించాడు. ఇది టీజర్ లోనే హైలెట్ అయింది. విజువల్ గ్రాండియర్ కనిపిస్తోంది.. అలాగే భారీ తారాగణం కూడా ఉంది. క్రైమ్ చుట్టూ అల్లుకున్న కథ ఇది అని అర్థం అవుతోంది. ఓ మూగవాడైన ఎనర్జిటిక్ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది..? ఆ అమ్మాయికి కూడా అతనంటే ఇష్టమేనా.. అని తెలుసుకోబోయే టైమ్ లో అతని చుట్టూ ఓ వెయ్యి కోట్ల వ్యవహారం ముడిపడి ఉంటుంది. మరి ఈ వెయ్యి కోట్లు ఎవరివి, ఆ వెయ్యి కోట్లకు ఈ కుర్రాడికి ఉన్న సంబంధం ఏంటీ..? అసలా క్రైమ్ లో ఈ పార్ట్ ఎలా వచ్చింది అనేది ట్రైలర్ లో కనిపిస్తోంది. బట్ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ బిగ్గెస్ట్ మైనస్ గా ఉంది. సినిమాలో ఎంతో బావుండి ఉండొచ్చు.. ట్రైలర్ లో హైలెట్ అయితేనే కదా.. ఆడియన్స్ లో ఈ మూవీపై ఇంట్రెస్ట్ వచ్చేది.
భారీ పోటీ మధ్య విడుదలవుతోన్న ఇట్లు అర్జున
రాకాస మూవీ దర్శకురాలు మానస శర్మ ఫ్రెండ్ మహేష్ ఉప్పాల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. మరో దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రంతో నిర్మాతగా మారాడు. థమన్ సంగీతం అందించాడు. ఏ మాటకామాటే పాటలైతే బావున్నాయి. ట్రైలర్ లో చేసిన ఈ ప్రయోగం ఏమంత ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇక ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కాబోతోంది. ఆ రోజు ఇట్లు అర్జునతో కలిపి ఏకంగా 9 సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఇంత పోటీలో ఇట్లు అర్జున నిలబడుతుందా లేదా అనేది కూడా డౌటే.
