Gaaradi Telugu news logo

ఆకాశంలో ఒక తార ట్రైలర్

దుల్కర్ సల్మాన్, సాత్వికల ఆకాశంలో ఒక తార ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ టీజర్ తోనే చాలామందిని ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ లో కథ ఇదే అని ముందే ఆడియన్స్ ను ప్రిపేర్ చేసినట్టుగా ఉంది. అంటే ఇలాంటి సినిమాలకు కథ ఇలాగే ఉంటుందని ముందే తెలిసిపోతుంది. కాకపోతే కథనం ఎలా ఉండబోతుంది అనేది గెస్ చేయడానికి దూరంగా ఉండాలి. ఈ ఆకాశంలో ఒక తార ట్రైలర్ కూడా ఇలాగే ఉంది. కథ తెలిసిపోయింది. బట్ కథనం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.. ఇందులో సంఘర్షణలు ఎలా ఉంటాయి.. ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది.

దుల్కర్ పాత్ర కథానుసారమే

దుల్కర్ సల్మాన్ కంటే సాత్వికపైనే ఈ కథ మొత్తం సాగుతుందని తెలుస్తుంది. ఈ కథను ముందుకు నడిపించే వాడుగా దుల్కర్ కనిపించబోతున్నాడు. మామూలుగా దుల్కర్ లాంటి స్టార్ హీరోలకు ఇలాంటి పాత్రలు చేయడం రిస్క్. బట్ ఇలాంటి రిస్క్ లు చాలానే చేసిన, చూసిన వాడుగా బాగా సక్సెస్ అయ్యాడు దుల్కర్. దుల్కర్ కు తన పాత్రలే హైలెట్ కావాలని చూడడు. కథలో దమ్ముందా లేదా అనేది మాత్రమే చూస్తాడు. ఈ ఆకాశంలో ఒక తార కూడా అలాగే ఉండబోతోందని అర్థమయ్యేలాగానే ఈ ట్రైలర్ కనిపిస్తోంది.

సపోర్టింగ్ రోల్ లో శ్రుతి హాసన్

సాత్వికకు ఇది ఫస్ట్ మూవీ. అయినా అద్భుతంగా నటించిందని ట్రైలర్ తోనే తేలిపోయింది. తనతో పాటు శ్రుతి హాసన్ కూడా ఓ కీలక పాత్రలో ఉందని తెలుస్తోంది. తన కాస్త పాష్ లేడీగా ఈ మూవీలో కనిపించబోతోంది. అంటే సిగరెట్లు తాగడం, మందు తాగడం కూడా ఉంది. ఇది కేవలం ఆ పాత్రకు తగ్గట్టుగానే ఉండబోతోందనిపిస్తోంది. అదే టైమ్ లో శ్రుతి హాసన్ వల్లే సాత్విక పాత్ర మరో స్థాయికి వెళ్లబోతోందని కూడా తెలుస్తోంది.

పవన్ సాధినేని దర్శకత్వం చేసిన చిత్రం ఆకాశంలో ఒక తార. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ చిత్రానికి సమర్పకులుగా గీతా ఆర్ట్స్, వైజయంతి బ్యానర్ అండగా నిలిచింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఏదేమైనా ఇదో మంచి ట్రైలర్ లాగానే ఉంది. ముందే చెప్పినట్టుగా ట్రైలర్ లోనే కథంతా చెప్పేశారు. మరి కథనంలో ఓ మ్యాజిక్ ఉంటే సినిమా హిట్ అయిపోతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి