Gaaradi Telugu news logo

రావణుడిపై సాయి పల్లవి హాట్ కామెంట్స్

సాయి పల్లవి అంటే మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. తను ఎంచుకుంటోన్న కథలే అద్భుతంగా ఉంటాయి. అందులో తన టాలెంట్ తో మరో స్థాయికి తీసుకువెళుతుంది. స్టార్ హీరోలు అని కాకుండా కేవలం కథలే ఫైనల్ గా భావించే తను సెలెక్ట్ చేసుకుంటుంది. అందుకే తను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం దేవుళ్లపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ పై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. కొందరు తనకు పాజిటివ్ గా మాట్లాడితే చాలామంది ఆమెపై నెగెటివ్ గా మాట్లాడారు. అందుకే తను రామాయణలో సీత పాత్ర చేస్తున్నప్పుడు కూడా చాలామంది వ్యతిరేకించారు. అయితే ఇదే రామాయణ విషయంపై సాయి పల్లవి మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

రావణుడు అంత చెడ్డవాడు కాదు..

రామాయణ మూవీ ప్రీమియర్స్ సందర్భంగా తను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోసారి ఆమెను చాలామంది టార్గెట్ చేస్తూ నెగెటివ్ గా మాట్లాడ్డం మొదలు పెట్టారు. మరి తను చేసిన ‘రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు. కొన్ని పరిస్థితుల వల్ల తను ఇలా మారాడు. లేకపోతే అతను చాలా మంచివాడే’.. అంటూ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది ఫైర్ అవుతున్నారు. వారంతా మరోసారి సాయి పల్లవిపై విరుచుకు పడుతున్నారు.

సాయి పల్లవి మాటల్లో తప్పేం లేదా..?

నిజానికి సాయి పల్లవి చెప్పిన దాంట్లో తప్పేం లేదు. రావణుడు తన రాజ్యమేదో తనే చూసుకునేవాడు. పరమశివుడికి వీరభక్తుడు. తన భక్తితో శివుడినే గడగడలాడించినవాడు రావణుడు. లంక ఓ గొప్ప రాజ్యంగా విరాజిల్లింది కూడా. తన చెల్లి శూర్పణఖకు జరిగిన అవమానం పై అతను చేసిన చర్యల కారణంగానే అతను చెడ్డవాడుగా కనిపించాడు తప్ప.. ఒక్కటి కాకుండా ఏ విషయంలోనూ రావణుడు తప్పుడు వాడు అని చెప్పడానికి లేదు.

వాల్మీకి రామాయణంలో రాముడే తప్పుడు వాడే అనేవాళ్లున్నారా..?

రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షంలో అసలు రాముడే చెడ్డవాడు అని చెప్పింది. వాల్మీకి రామాయణం ఆధారంగానే కదా రామాయణం వచ్చింది. మరి వాల్మీకి రామాయణం చూస్తే ముందు అసలు ఇదంతా కట్టు కథ అని తేలిపోతుంది కదా. సో.. కొన్ని విషయాలను బ్లైండ్ గా వెళ్లడం సరైంది కాదు. ఇంకా చెబితే తన చెల్లికి జరిగిన అవమానం కారణంగా రావణుడు సీతను ఎత్తుకు పోయాడు కానీ.. ఆమెపై కన్ను వేయలేదు. ఆమెను ఇబ్బంది పెట్టలేదు. అవమానించలేదు. ఇది వాల్మీకి రామాయణమే కాదు.. మిగతా అన్ని రామాయణాల్లోనూ కనిపిస్తోంది.

హ్యాట్సాఫ్ సాయి పల్లవి

సో.. సాయి పల్లవి చెప్పిన దాంట్లో అస్సలు తప్పు లేదు. తప్పులు మాత్రమే చూస్తున్నవాళ్లకు తను చేసిన వ్యాఖ్యల్లో నిజాలు వెదికే వాళ్లకు కనిపించడం లేదు. బట్.. ఈ సందర్భంగా సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు మాత్రం సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి