Gaaradi Telugu news logo

నయనతార ఉంటే హిట్టే

నయనతార అంటే లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని స్టార్డమ్ ఉంది. తను ఓ సినిమా చేస్తోంది అంటే మాగ్జిమం హిట్ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆ కారణంగానే తన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. గతంలో మూకుత్తి అమ్మన్ అనే మూవీతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ చేసింది. ఈ సీక్వెల్ కు సుందర్ సి దర్శకుడు. ఈ చిత్రాన్ని మహాశక్తి టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్ కు ఆర్జే బాలాజీ దర్శకుడు. రెండో భాగాన్ని సుందర్ సి అనగానే అంచనాలు మరింతగా పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మూవీ ఉండబోతోందని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

మహాశక్తిలో డ్యూయొల్ రోల్

నయనతార ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించబోతోంది. ఒకటి పోలీస్ గా మరోటి అమ్మోరు తల్లిగా ఉండబోతోంది. ట్రైలర్ చాలా అంటే చాలా ప్రామిసింగ్ గా ఉంది. అయితే ఇది ఏ కాలంలో సాగే కథా అనేది తెలియకుండా ట్రైలర్ కట్ చేశారు. ఒకటి ఈ కాలంలో సాగే కథలాగానూ మరోటి మైథలాజికల్ మూవీలాగానే కనిపిస్తోంది. మరి ఈ రెండు కాలాల్లోనూ అమ్మోరు తల్లి చూపించే పవర్స్ ఏంటీ.. ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. సుందర్ సి గతంలో అరణ్మణై అనే మూవీస్ తో బాగా హిట్స్ కొట్టాడు. అరణ్మణై కి ఏకంగా నాలుగు భాగాలుగా రూపొందించాడు. అన్ని హిట్ అయ్యాయి. తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయం సాధించాయి.

సుందర్ సి.. విజువల్ వండర్ లా మహాశక్తి ట్రైలర్

సుందర్ సి మూవీ అంటే ఒకప్పుడు సాధారణంగా ఉండేవి. కానీ ఇప్పుడు గ్రాండియర్ గా చేస్తున్నాడు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లో ఆరితేరినవాడిగా కనిపిస్తున్నాడు. అదే ఈ మహాశక్తి ట్రైలర్ లో కూడా కనిపిస్తోంది. విజువల్ గ్రాండియర్ గానే కాదు కాస్టింగ్ లో కూడా భారీతనం కనిపిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్, రెజీనా కసాండ్రా దుష్టశక్తులుగా కనిపించబోతున్నారు. వీరి పాత్రలకూ మంచి ప్రాధాన్యమే ఉండేలా ఉంది. ఏదేమైనా ఈ ట్రైలర్ చూడగానే చాలా ప్రామిసింగ్ మూవీ అనిపిస్తోంది. కాకపోతే రామాయణ విడుదలైన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అంటే రామాయణ నవంబర్ 5న వస్తుంటే 6న మహాశక్తి విడుదల కాబోతోంది. మరి రామాయణ పై అంటే కాస్త ఆలోచించాలి. బట్ కంటెంట్ లో దమ్ముంటే ఇవన్నీ పట్టించుకోరు ఆడియన్స్ అనేది చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మరి మహాశక్తి కూడా హిట్ కొట్టబోతోందా లేదా అనేది చూడాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి