
యశ్ రావణతాండవం
యశ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తో తిరుగులేని స్టార్డమ్ వచ్చింది. బట్ టాక్సిక్ మొత్తం పోయింది అనుకున్నారు. బట్ రామాయణలో రావణాసురుడు పాత్రలో అతనే హైలెట్ గా ఉండబోతున్నాడు అని ప్రతి ఒక్కరూ ముందు నుంచీ చెబుతున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ లోనే యశ్ పాత్రే హైలెట్ గా నిలవబోతోందని ఫిక్స్ అయ్యారు. అది నిజం అనిపించేలా లేటెస్ట్ గా విడుదల చేసిన రావణతాండవం చూస్తే అర్థమవుతుంది.
యశ్ మాత్రమే హైలెట్ కాబోతున్నాడా..?
యశ్ రావణుడి పాత్రలో అద్భుతంగా నటించాడు అని తెలుస్తోంది. అసలా తాండవం చూస్తుంటనే ఒళ్లంతా పూనకం వచ్చినట్టుగా కనిపిస్తోంది. చూస్తున్నవాళ్లకే ఇలా అనిపిస్తే ఇక చేసిన వాడికి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఓ రకంగా ఈ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో కూడా అర్థం చేశారు. మామూలుగా రావణాసురుడు మహాశివుడికి మహా భక్తుడు. ఆయన ధ్యానంలో ఉంటే ఇంకేమీ పట్టించుకోడు అనేది ఆ పురాణ గాథలు చూస్తే మనకూ తెలుస్తుంది. దాన్నే హైలెట్ గా చేస్తే రావణుడు శివుడి కోసం ఓ తాండవం ఆడినట్టుగా చూపిస్తూనే అతనెంత బలవంతుడు అనేది కూడా హైలెట్ గా చేశారు. విశేషం ఏంటంటే.. ఆదిపురుష్ లా కాకుండా ఇందులో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మరో స్థాయిలో ఉన్నాయని అర్థం అవుతోంది.
సీతారాములుగా సాయి పల్లవి, రణ్ బీర్ కపూర్
ఎలా చూసినా రావణుడుగా యశ్ మాత్రమే హైలెట్ కాబోతున్నాడని అర్థం అవుతూనే ఉంది. రాముడుగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించింది. ఇప్పటికే రణ్ బీర్ .. రాముడుగా సెట్ కాలేదు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. సాయి పల్లవి వంద శాతం సూట్ అయిందని చెబుతున్నారు. ఏదేమైనా యశ్ రావణ తాండవం మరో స్థాయిలో ఉంది. ఈ తాండవం చూడగానే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి అనేది వాస్తవం.
