చిరంజీవి నెక్ట్స్ మూవీ ఏంటీ..?
మెగాస్టార్ చిరంజీవి లైనప్ స్ట్రాంగ్ గా ఏం లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా కాక మీదే ఉంది. కాక 2027 సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కాబోతోంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఇది. అలాగే విశ్వంభర కూడా అదే టైమ్ కు విడుదలవుతుందని టాక్ వినిపిస్తోంది. అదెలా ఉన్నా.. కాక మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి బరిలోనే వస్తుందని బలంగా చెబుతున్నాడు చిరంజీవి. అలాగే చిరంజీవి ఒక సినిమా పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా కాక తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ ద ప్యారడైజ్ రిజల్ట్ చూసి చిరంజీవి వెనక్కి తగ్గాడు. శ్రీకాంత్ మూవీని వదులుకున్నాడు. ఈ టైమ్ లో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
కార్తీక్ సుబ్బరాజ్, చిరుకి కథ సిద్ధం చేశాడా..?
కార్తీక్ సుబ్బురాజ్ అంటే క్రియేటివ్ డైరెక్టర్. ఓ సినిమాకు మరో సినిమాకు సంబంధం లేని కంటెంట్ తో బాగా ఆకట్టుకుంటాడు. 2025లో అత్యంత భారీ అంచనాలతో వచ్చిన రెట్రో డిజాస్టర్ అయింది. తర్వాత ఈ యేడాది డోరోతి అనే డిఫరెంట్ మూవీతో వచ్చాడు. దీనికి విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా అతని టేకింగ్ చూసి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అలాంటి దర్శకుడితో చిరంజీవి మూవీ చేయబోతున్నాడా అనే టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది.
చిరంజీవి, కార్తీక్ కాంబినేషన్ పై భారీ హైప్
కార్తీక్ సుబ్బరాజ్ ఓ కథను చిరంజీవి కోసం తయారు చేశాడట. ఈ కథను చిరంజీవికి వినిపించాడు. కాకపోతే మెగాస్టార్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరి ఆ కథ చిరంజీవికి నచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. బట్ కార్తీక్ మాత్రం మెగాస్టార్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కథ రాసుకున్నాడట. గతంలో రజినీకాంత్ తో పేటా అనే మూవీ చేశాడు. కానీ ఇదేమంత పెద్ద హిట్ కాదు. మరి ఈ కారణంగా చిరంజీవి ఈ కథను లైట్ తీసుకున్నాడా లేక కాక తర్వాత కార్తీక్ తో మూవీకి సిద్ధమవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. బట్ ఈ కాంబినేషన్ మాత్రం ఇప్పటికే మోస్ట్ క్రేజీగా కనిపిస్తోంది.
