Gaaradi Telugu news logo

నాగ చైతన్య మూవీ వృషకర్మ. కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. మీనాక్షి చౌధరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని మేకర్స్ చెబుతున్నారు. ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. కానీ అందులో కేవలం నాగ చైతన్య మాత్రమే కనిపిస్తున్నాడు. దర్శకుడు, హీరోయిన్ తో పాటు మిగతా ఇంపార్టెంట్ రోల్స్ చేసిన వాళ్లను కూడా ప్రమోషన్స్ లో భాగస్వామ్యం చేస్తే హైప్ ఇంకాస్త పెరుగుతుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ వర్మ దండు గతంలో విరూపాక్షతో బాగా ఆకట్టుకున్నాడు. వెరీ లిమిటెడ్ లొకేషన్స్, బడ్జెట్ తో ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టాడు. అది కంటెంట్ వల్ల వచ్చిన రిజల్ట్ ఇది అని అందరికీ తెలుసు.
వృషకర్మ కాస్త భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా. అందుకే ఈ మూవీ కొనడానికి చాలాకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. లేదంటే ఇప్పటికే విడుదల కావాల్సింది. అలాగే ఓటిటి వాళ్లు కూడా భారీ రేట్ అనగానే వెనక్కి తగ్గారు. ఆలస్యానికి అదీ ఓ కారణం. ఇక నాగ చైతన్య తండేల్ తో భారీ విజయం అందుకున్నాడు. దాన్ని కంటిన్యూ చేసేలానే వృషకర్మ ఉండబోతోందని అంచనాలు వేస్తున్నారు.
నితిన్ విషయం వేరేలా ఉంది. మనోడు ఓ రేంజ్ లో ఫ్లాపులు, డిజాస్టర్లు చూస్తున్నారు. అతని లాస్ట్ హిట్ మూవీ అంటే భీష్మ. అది ఐదేళ్లకు పైనే అయింది. కొత్త కథలతో ప్రయత్నాలు చేసినా మనోడికి హిట్ అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అలాంటి స్టేజ్ లో దండోరా చిత్రంతో ఆకట్టుకున్న మురళీ కాంత్ దర్శకత్వంలో అలియాస్ రుక్మిణీ మూవీతో వస్తున్నాడు. అలియాస్ రుక్మిణి కూడా ఈ డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. ఇది కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రాన్ని నిర్మించింది నాని కావడమే. నాని నిర్మించాడు అంటే కథలో దమ్మున్నట్టుగానే ఆడియన్స్ భావిస్తుంటారు. దీంతో ఇది వృషకర్మకు పోటీగా నిలవడం ఖాయం అని చాలామంది ఫీలవుతున్నారు.
నితిన్ అలియాస్ రుక్మిణిలో ఆఫియా సయ్యద్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తను క్యూట్ గా ఉంది. యాక్టింగ్ పరంగా కూడా బాగా ఆకట్టుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటతో బాగా ఆకట్టుకుంది. నితిన్ కూడా చాలా సెటిల్డ్ గా నటించాడు నాని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అయితే వీళ్లు కూడా ప్రమోషన్స్ లో కాస్త వీక్ గానే ఉన్నారు.
మొత్తంగా నాగ చైతన్య, నితిన్ మధ్య పోటీ ఉండటం ఖాయమైంది. మరి ఈ పోటీలో ఎవరు స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తారు అనేది చూడాలి. అయితే ఇప్పటికైతే వృషకర్మకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది. అలియాస్ రుక్మిణి కంటెంట్ బావుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి