అగ్గిపెట్టె మచ్చా కన్నుమూశాడు. తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మచ్చా ఇవాళ కన్ను మూశాడు. అగ్గిపెట్టె మచ్చా అసలు పేరు కిరణ్ కుమార్. తెలుగు మీమ్స్, ఫన్నీ వీడియోలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా సడెన్ గా వెలుగులోకి వచ్చాడు మచ్చా. అప్పటి నుంచి తనదైన శైలిలో చాలామందిని ఎంటర్టైన్ చేశాడు. ఓ రకంగా అతని మెంటల్ స్టేటస్ కూడా సరిగా లేదు. ఆ కారణంగా ఏదైనా ఒరిజినల్ గానే మాట్లాడతాడు. అదే ఫన్ జెనరేట్ అయ్యే కంటెంట్ లాగా మారింది.
అగ్గిపెట్టె మచ్చా ఊరు తిరుపతి. అక్కడే పెరిగాడు. చిన్నతనం నుంచి మనసిక వ్యాధి వల్ల ఇలా తయారయ్యాడు. తన అక్కే అతనికి అన్నీ అయ్యి పెంచింది. మానసికంగా ఇబ్బంది పడుతున్న అగ్గిపెట్టె మచ్చాను చాలామంది ఏడిపించారు. అతన్ని ఆటాడేసుకుంటూ సోషల్ మీడియాలో సొమ్ములు చేసుకున్నారు. ఇంకొందరైతే అతన్ని బాగా టార్చర్ చేశాడు. ఈ టైమ్ లో అతను స్పందించే విధానం ‘రా’గా ఉండేది. దాన్ని కూడా క్యాష్ చేసుకున్న మూర్ఖులు చాలామంది ఉన్నారు.
అగ్గిపెట్టె మచ్చాకు ఆరోగ్యం బావుండదు అని అతని అక్క ప్రతిసారీ చెబుతూ ఉండేది. ఆ కారణంగానే అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని చెబుతూ ఉండేది. విశేషం ఏంటంటే.. అగ్గిపెట్టె మచ్చా కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. మరి ఆ టైమ్ లో అతనికి సరిగ్గా డబ్బులు ఇచ్చారా లేదా అనేది తెలియదు. అదే కారణంగా బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్ తో యూ ట్యూబ్ లో కూడా హల్చల్ చేశాడు. అగ్గిపెట్టె మచ్చాగా అతని తిరుపతి స్లాంగ్ మాత్రం చాలామందికి నచ్చేది. ఏదేమైనా ఆయన మరణానికి గారడీ డాట్ కామ్ సంతాపాన్ని తెలియజేస్తోంది.
