
శర్వానంద్ భోగి వాయిదా
భోగి.. రిలీజ్ కు ముందు బజ్ లేదు. హైప్ అస్సలు లేదు. క్రేజ్ కాస్త కూడా కనిపించడం లేదు. ఈ కారణంగానే సంపత్ నంది డైరెక్ట్ చేసిన భోగి విడుదల వాయిదా పడింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శర్వానంద్ కు ఇది రంగస్థలం లాంటి మూవీ అవుతుందని చెప్పారు. రిలీజ్ కు ముందు అసలు సందడే లేకపోవడం కొంత ఆశ్చర్యం అనిపించింది. పైగా ఆల్రెడీ విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు పాటలతోనే గ్రాండ్ ఓపెనింగ్ రావడం ఖాయం అనుకున్నారు. అలాంటిదేం కనిపించకపోవడం కొంత ఆశ్చర్యంగా ఉంది.
భోగితో శర్వానంద్ హ్యాట్రిక్ కొడతాడా..?
శర్వానంద్ కొన్నాళ్లుగా సరైన ఫామ్ లో లేడు. అయితే ఈ యేడాది వచ్చిన నారీ నారీ నడుమ మురారి, బైకర్ చిత్రాలకు మంచి వసూళ్లు వచ్చాయి. దీంతో శర్వానంద్ ఫామ్ లోకి వచ్చినట్టే అని భావించారు. అలాగే భోగితో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనుకున్నారు. భోగి ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈ నెల 13న ఏకంగా అరడజను సినిమాలున్నాయి. ఇవన్నీ భోగిని చూసి భయపడలేదు. ఆ సినిమాల్లో మేటర్ ఎంత ఉందో తెలియదు కానీ.. భోగిని లైట్ తీసుకోవడం విశేషం.
భోగి కొత్త డేట్ ఇదేనా..
శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. భోగి 1960ల నేపథ్యంలో సాగే కథ అని ముందే చెప్పారు. అలాగే అచ్చమైన తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇది. ఏదేమైనా ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన భోగిని ఈ నెల 27న విడుదల చేస్తారు అనే టాక్ ఉంది. లేదంటే డిసెంబర్ 11న అయినా వస్తుందంటున్నారు.
