Gaaradi Telugu news logo

అక్టోబర్ 30న ఆదర్శ కుటుంబం

నాగవంశీ మాటలపై ఈ మధ్య ప్రేక్షకుల్లో నమ్మకం తగ్గిపోతోంది. ఆదర్శ కుటుంబం మామూలుగా ఈ సమ్మర్ లో విడుదల కావాల్సిని సినమా. బట్ కథలో మార్పులు అంటూ అక్టోబర్ 2కి వాయిదా వేశారు. టైమ్ కూడా కాదని అక్టోబర్ 9కి వస్తున్నాం అన్నారు. అదీ పోయింది. ఇప్పుడు అక్టోబర్ 30కి వస్తున్నారు. బట్ ఈ డేట్ పై కూడా నమ్మకం లేదు అంటున్నారు. అందుకు కారణాలు ఏంటీ అంటే స్థానిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చెప్పినట్టే తుఫాన్ ఎఫెక్ట్ అంటున్నారు.

తుఫాన్ కారణంతో వాయిదా

త్రివిక్రమ్ పని అయిపోయింది. సినిమా తీశాడు. మొత్తం రెడీ చేశాడు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కూడా రిలీజ్ విషయంలో అనుమానాలు ఉన్నాయంటే మేకర్స్ కు ఎంత భయం ఉందని అనుకోవాలి. అదీ కాక ఆదర్శ కుటుంబంకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు కూడా పెంచారు. కానీ ఇటు చూస్తే అర్నబ్ తుఫాన్ భారీగా విరుచుకుపడుతోంది. అందుకే మూవీని పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో ఉందట టీమ్.

నాగవంశీ ప్రతిసారీ ఇరుక్కుంటున్నాడుగా

మామూలుగా ఇలాంటి వార్తలను నిర్మాత చినబాబు చెప్పడు. నాగవంశీతో చెప్పిస్తాడు. గతంలో కూడా అతనితోనే చెప్పించాడు. ఈ విషయంలో ఎన్నిసార్లు చెప్పడానికైనా నాగవంశీ వెనకాడడు. బట్ ఈ సారి కూడా వాయిదా పడితే ఇప్పటికే ఆదర్శ కుటుంబం కారణంగా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటోన్న చిన్న సినిమాలు మరోసారి బాగా ఇబ్బంది పడతాయి అనేది వాస్తవం. అదీ కాక ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అంటే ఆడియన్స్ లో కూడా ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పటికే ఆదర్శ కుటుంబం ట్రైలర్ బావున్నా బజ్ లేదు అని చాలామంది ఫీలవుతున్నారు. మరి ఈ సారి కూడా వాయిదా అంటే ఓవరాల్ గా మూవీనే షెడ్ కు వెళుతోందనేది వాస్తవం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి