ఫహాద్ ఫాజిల్ ఫస్ట్ తెలుగు మూవీ
ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మూవీ డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇది మళయాల మూవీ. కాకపోతే ఇది తెలుగు సినిమానే అంటున్నారు. అందుకు కారణం రాజమౌళి టీమ్ వాళ్లు నిర్మించినది.కార్తికేయ, శోభు యార్లగడ్డ,ప్రసాద్ దేవినేని నిర్మించిన మూవీ ఇది. చాలామందికి ఈ మూవీ దర్శకుడు ఎవరు అనే క్వశ్చన్ వినిపిస్తోంది. ఇంకా చెబితే ఆ దర్శకుడు కూడా మళయాలీ అనుకుంటున్నారు. కానీ కాదు. ఈ చిత్ర దర్శకుడు శశాంక్ ఏలేటి. ఇక సంగీతం అందించింది కాల భైరవ. కాబట్టి ఇక ఈ మూవీ తెలుగుదే అని వేరే చెప్పక్కర్లేదు.
డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రైలర్ బావుంది
ఫహాద్ ఫాజిల్ తో పాటు సారా ఫాలేకర్ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. రీసెంట్ గా విడుదలైన డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. వెరీ ఇంప్రెసివ్ ట్రైలర్ అనిపిస్తోంది. అదీ కాక ఫహాద్ ఫాజిల్ ఒక ఇమేజ్ చట్రంలో లేకపోవడం మరో ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అదే రోజున సందీప్ కిషన్ హీరోగా నటించిన సిగ్మా కూడా రాబోతోంది.
సందీప్ కిషన్ సిగ్మాతో వస్తున్నాడు
సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడుగా పరిచయమవుతున్న మూవీ సిగ్మా. ఇది కంప్లీట్ గా తమిళ్ మూవీనే. సందీప్ కిషన్ తెలుగు హీరో కాబట్టి తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. జాసన్ సంజయ్ దర్శకుడు కాబట్టి తెలుగు వాళ్లకూ ఈ మూవీపై హోప్స్ ఉన్నాయి. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ కావడం మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
ఫహాద్ ఫాజిల్ vs సందీప్ కిషన్
ఇక సందీప్ కిషన్ అంటే తెలుగు హీరో తమిళ్ దర్శకుడు.. ఫహాద్ ఫాజిల్ అంటే మళయాల హీరో తెలుగు దర్శకుడు. మరి ఈ ఇద్దరు మధ్య తెలుగులో మంచి పోటీ ఉండబోతోంది అనిపించేలా ఉంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనిపించుకుంటారు.. ఎవరి మూవీ ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది అనే పోటీ మాత్రం బలంగా ఉంది. అదే టైమ్ లో ఈ ఇద్దరి మూవీస్ తో పాటు తెలుగు మూవీస్ కూడా పోటీ పడుతున్నాయి. బట్ కాంపిటీషన్ మాత్రం ఫహాద్ ఫాజిల్ అండ్ సందీప్ కిషన్ మధ్యే ఉండబోతోంది అని కూడా చెప్పొచ్చు.
