Gaaradi Telugu news logo

నాని ప్యారడైజ్ పోతుందా..

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ద ప్యారడైజ్. నాని మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉండటం కామన్. బట్ ద ప్యారడైజ్ మూవీపై ఆ అంచనాలు కనిపించడం లేదు. కనీసం మేకర్స్ కూడా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచే ప్రయత్నం చేయడం లేదు. అందుకు కారణం.. టైమ్ లేదు అనే డైలాగ్. యస్.. బట్ టైమ్ లేకపోవడం అనేది సరైన కారణమా అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ఎప్పుడూ సరైన ప్లానింగ్ లో లేదు. కంటెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయో తెలియదు కానీ మేకింగ్ విషయంలో మాత్రం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ పద్దతీ పాడూ లేదు అనే చెప్పాలి.

నాని ప్లానింగ్ సరిగా లేదా

నాని మామూలుగా తన మూవీస్ ప్లానింగ్ విషయంలో బాగానే ఉంటాడు. కానీ కొన్నాళ్లుగా నాని కూడా తేడాగానే ఉంటున్నాడు. అందుకు కారణం దర్శకులను బ్లైండ్ గా నమ్మడమే అని చెప్పాలి. లేదంటే ఇప్పుడిప్పుడే ప్యాన్ ఇండియా హీరో అనిపించుకోవాలని తెగ తాపత్రయపడుతున్న నాని ఇలాంటి డైరెక్టర్ ను నమ్మి ఇంత కాలం ఆగడం విచిత్రమే. కేవలం ఒక్క సినిమాతో తనో చాలా పేద్ద దర్శకుడు అనే బిల్డప్ మాత్రం బాగా చూపిస్తుంటాడు శ్రీకాంత్. ఇలాంటి వారి విషయంలో తెలుగు సినిమా పరిశ్రమలో ‘ద్వీతీయ విఘ్నం’ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చాలామంది భావిస్తుంటారు.

బడ్జెట్ కి మించిన ఖర్చు

నాని ద ప్యారడైజ్ మూవీ మొదలు పెట్టినప్పుడు దీని స్కేల్ ఎంత అనేది అంత ఈజీగా చెప్పలేరు. బట్ స్టార్ట్ అయిన తర్వాత దాని స్కేల్ ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ విషయంలో సదరు శ్రీకాంత్ ఓదెల చేసే ఓవరాక్షన్ భరించలేరు అంటారు చాలామంది. అందులో నిజమెంత అనేది మనకు తెలియదు కానీ మూవీ మేకింగ్ లో క్లారిటీ లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లేదంటే ఒక సినిమా కోసం అదీ కూడా చాలా వరకూ సెట్టింగ్స్ లోనే సాగేదే. అయినా స్పష్టత లేదు అంటే అంతకు మించి చెప్పడానికి ఏం ఉంటుంది. మనోడికి క్లారిటీ లేదు.

ప్లానింగ్ లేని శ్రీకాంత్ ఓదెల

నాని లాంటి స్టార్స్ ను హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ఒళ్లు జాగ్రత్త పెట్టుకోవాలి. ఆ విషయం శ్రీకాంత్ ఓదెల పట్టించుకోలేదు. ఓ రకంగా ద ప్యారడైజ్ మూవీకి చెప్పిన బడ్జెట్ కి, అయిన బడ్జెట్ కు మధ్య తేడా చాలా అంటే చాలా ఉంది. ఓ రకంగా చూస్తే ఇది 100 కోట్ల బడ్జెట్ మూవీ అని చెప్పారు. బట్ ఇప్పటికే ఇది 160 కోట్ల వరకు అయింది. అంటే నిర్మాతకు ఎంత లాస్. అఫ్ కోర్స్ మూవీకి మంచి బజ్ ఉంది. ప్రీ బిజినెస్ కూడా అయింది. బట్ కంటెంట్ లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇంతకు ముందులాగా కాదు.. ఇప్పుడు ఓటిటి నుంచి అడ్వాన్స్ ల వరకు వెనక్కి తెచ్చుకుంటున్నారు చాలామంది.

నాని రిస్క్ చేయకుండా ఉండాల్సింది

ఏదేమైనా నాని మరీ ఇంత రిస్క్ చేయకుండా ఉండాల్సింది. ఇలాంటి మూవీ ప్లేస్ లో ఈజీగా రెండు సినిమాలు చేయగల కెపాసిటీ నానికి ఉంది. కేవలం దర్శకుడిని గుడ్డిగా నమ్మి ఇంత స్థాయిలో మూవీ చేయడం ఏమంత శ్రేయస్కరం కాదు. రిలీజ్ కు ముందు చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలియకుండా ఉండటం కూడా సరైనది కాదు. ఇంకా చెబితే నాని సొంత బ్యానర్ లో చేసిన హిట్ 3 విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. అద్భుతమైన ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాడు. దాని వల్ల ప్యాన్ ఇండియా కలర్ వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే అతని ప్రయత్నం బలంగా ఉంది.
నాని ద ప్యారడైజ్ విషయంలో మాత్రం ఇవేవీ కనిపించడం లేదు. కనీసం నాని, శ్రీకాంత్ బిజీగా ఉన్నాడు అంటే ఈ మూవీలో నటించిన మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు లేదంటే హీరోయిన్ కయాడు లోహర్ కనీసం విలన్ అయినా ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇవన్నీ జరగడం లేదు అంటే అసలు ఈ మూవీపై ఎవరికీ నమ్మకం లేదు అనే అనుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో మూవీని లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇందుకు ఆస్కారం లేదు అనేదే చాలామంది అభిప్రాయం.

నాని ప్యారడైజ్ నేర్పే పాఠాలేంటీ..?

నాని ద ప్యారడైజ్ మూవీ నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉంది. కొత్త దర్శకులైనా, పాత దర్శకులైనా కంటెంట్ పై బలంగా ఫోకస్ చేయాలి. ప్రీ ప్రొడక్షన్ పక్కాగా పూర్తి చేసుకున్న తర్వాతే ప్రొడక్షన్ లోకి దిగాలి. ఒక్కసారి షూటింగ్ మొదలైందీ అంటే దాని గురించే తప్ప ఇంకేవీ ఆలోచించకూడదు. అలా ఆలోచించడం మొదలు పెడితే ఇంక ఆ సినిమా ప్యారడైజ్ లా మారిపోవడం ఖాయం అని తేలేలా ఉంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి